బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య ఉన్న‌వారికి అద్భుత‌మైన చిట్కా.. నెల రోజుల్లోనే ఫ‌లితం..

ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం క‌దా. ఇవి లేకుండా మ‌నం ఏ కూర‌ను చేయ‌లేం. ఉల్లిపాయ‌ల‌ను అస‌లు తిన‌ని వారు ఉండ‌రు. కొంద‌రు వీటిని ప‌చ్చిగానే లాగించేస్తారు. అయితే ఉల్లిపాయ‌లు వంట‌ల‌కు రుచిని అందివ్వ‌డ‌మే కాదు, మ‌న‌కు పోష‌కాల‌ను ఇస్తాయి. ముఖ్యంగా ఉల్లిపాయ‌ల నుంచి తీసిన ర‌సాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల బ‌ట్ట‌త‌ల‌పై వెంట్రుక‌లు క్ర‌మంగా మొల‌వ‌డం ప్రారంభ‌మ‌వుతుంది.

bald head best remedy in telugu

ఉల్లిపాయ ర‌సాన్ని కొద్దిగా తీసుకుని త‌ల‌పై బాగా రాయాలి. 2 గంట‌ల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స్నానం చేయాలి. ఇలా రోజూ చేయాలి. లేదా రాత్రి పూట ఉల్లిపాయ‌ల ర‌సాన్ని త‌ల‌కు రాసి మ‌రుస‌టి రోజు ఉద‌యం స్నానం చేయ‌వ‌చ్చు. ఇలా వ‌రుస‌గా 30 రోజుల పాటు చేస్తే క‌చ్చితంగా ఫ‌లితం ఉంటుంది. జుట్టు బాగా పెరిగేంత వ‌ర‌కు ఈ ర‌సాన్ని నిత్యం వాడ‌వ‌చ్చు.

జుట్టు పెరిగేందుకు కెరాటిన్ అన‌బ‌డే ప్రోటీన్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఉల్లిపాయ‌ల్లో ఉండే స‌ల్ఫ‌ర్ వ‌ల్ల కెరాటిన్ ఇంకా బాగా ప‌నిచేస్తుంది. దీంతో జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అలాగే జుట్టు దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది. బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య ఉన్న‌వారికి అందుక‌నే ఉల్లిపాయ‌ల ర‌సం అద్భుతంగా ప‌నిచేస్తుంది. అందుక‌నే చాలా వ‌ర‌కు కంపెనీలు ఉల్లిపాయ‌ల ర‌సం ఉన్న షాంపూల‌ను త‌యారు చేసి అందిస్తున్నాయి. అయితే వాటికి బ‌దులుగా స‌హ‌జ‌సిద్ధ‌మైన ఉల్లిపాయ‌ల ర‌సాన్నే నేరుగా వాడితే మంచి ఫ‌లితాలు ఉంటాయి. పైగా దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు.

గ‌మ‌నిక‌: పైన తెలిపింది ఓ సోద‌రుడి స్వీయ అనుభ‌వం. ఈ చిట్కా చాలా మందికి అద్భుతంగా ప‌నిచేసేందుకు అవ‌కాశం ఉంది. కానీ అంద‌రికీ ఇది ప‌నిచేస్తుందని చెప్ప‌లేం. క‌నుక ఎవ‌రి సొంత నిర్ణ‌యం ప్ర‌కారం వారు ఈ చిట్కాను పాటించాల్సి ఉంటుంది.

ఈ స‌మ‌స్య చాలా మందికి ఉంటుంది. క‌నుక మీకు తెలిసిన ఎవ‌రైనా ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటే వారికి ఈ స‌మాచారాన్ని షేర్ చేయండి..!

Admin

Recent Posts