Cucumber For Beauty : ముఖం అందంగా, తెల్లగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖం అందంగా కనబడడం కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల ముఖం అందంగా మారుతుంది. ముఖంపై ఉండే నలుపు, మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ముఖాన్ని తెల్లగా మార్చే ఆ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కీరదోసను, శనగపిండిని, పెరుగును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో అర ముక్క కీరదోసను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల శనగపిండిని, ఒక టీ స్పూన్ పెరుగును వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకునే ముందు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి లేపనంగా రాసుకోవాలి.
ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. సబ్బును ఉపయోగించకుండానే ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ ఈ చిట్కాను వాడడం వల్ల ముఖంపై ఉండే నలుపు, ట్యాన్, మృతకణాలు తొలగిపోతాయి. ముఖం అందంగా, మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.