Dark Circles : మనలో చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బందిపడుతూ ఉంటారు. వీటి వల్ల ఎటువంటి హాని కలగనప్పటికి వీటి కారణంగా ముఖం అంద విహీనంగా కనబడుతుంది. చాలా మంది వీటిని తొలగించుకోవడానికి లేసర్ ట్రీట్ మెంట్ లను, రసాయనాలు కలిగిన క్రీములను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య తలెత్తడానికి ముఖ్యంగా 11 కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒత్తిడి కారణంగా నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనిన్ చర్మ కణాల్లో ఎక్కువగా తయారవుతుంది. అలాగే నిద్రలేమి కారణంగా కూడా కళ్ల కింద నలుపుదనం ఎక్కువవుతుంది. నిద్రలేమి కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలతో పాటు ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది.
పనిలో అలసట కారణంగా కూడా కళ్ల కింద మచ్చలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా వంశపారపర్యంగా కూడా కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి. కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి కారణాల్లో హార్మోన్ల అసమతుల్యత కూడా ఒకటి. శరీరంలో చెడు హార్మోన్లు ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు, మచ్చలు వస్తూ ఉంటాయి. అదే విధంగా వయసు పైబడడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి. వయసు పై బడడం వల్ల శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా మారిన అలవాట్ల కారణంగా కళ్ల కింద నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి. అలాగే హైపో థైరాయిడిజం వల్ల కూడా కళ్ల కింద నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రక్తహీనత కారణంగా కూడా కళ్ల కింద, కళ్ల చుట్టు నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. ధూమపానం, మద్యపానం కారణంగా కూడా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. ఇక డీ హైడ్రేషన్ కారణంగా కూడా కల్ల కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి.
అదే విధంగా కంప్యూటర్స్, లాప్ టాప్స్, సెల్ ఫోన్ ల వంటి వాటిని ఎక్కువగా చూడడం వల్ల కళ్లు ఎక్కువగా అలసటకు గురి అవుతాయి. దీంతో కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. ఈ 11 కారణాల చేత కళ్ల కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. వీటిలో ఏ కారణం చేత కళ్లకింద వలయాలు వచ్చాయో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇక ఈ నల్లటి వలయాలను తగ్గించడంలో కరక్కాయ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కరక్కాయను అరగదీసి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద లేపనంగా రాయడం వల్ల కళ్ల కింద చర్మ కణాల్లో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వకుండా ఉంటుంది. రోజుకు రెండు సార్లు ఈ కరక్కాయ మిశ్రమాన్ని రాస్తూ చక్కటి జీవన విధానాన్ని అవలంబించడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు క్రమంగా తగ్గు ముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు.