Coffee Powder For Black Hair : ఈరోజుల్లో, వయసుతో సంబంధం లేకుండా, జుట్టు నెరిసిపోతోంది. జుట్టు తెల్లగా వచ్చేస్తోంది. 50 ఏళ్లు పూర్తి కాకుండా, 40 ఏళ్ళ లోనే, జుట్టు తెల్లగా మారుతోందా…? జుట్టు తెల్లగా ఉన్నట్లయితే, ఇలా చేయడం మంచిది. అప్పుడు జుట్టు నల్లగా ఉంటుంది. సమస్య ఉండదు. జుట్టు తెల్లగా వచ్చేస్తోందని, చాలామంది రంగులు వేసుకుంటూ ఉంటారు. రంగులు వలన ఆరోగ్యం అనవసరంగా పాడవుతుంది. రంగుల వలన జుట్టు కూడా దెబ్బతింటుంది. అలా కాకుండా, మీరు ఈ సింపుల్ చిట్కాలని కనుక పాటించినట్లయితే, 60 ఏళ్ళ వయసులో కూడా, జుట్టు నల్లగానే ఉంటుంది.
రంగు వేసుకోవాల్సిన అవసరమే లేదు. మరి తెల్ల జుట్టు సమస్యకి, ఎలా చెక్ పెట్టవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ ఇంటి చిట్కాతో మనం, ఈజీగా తెల్ల జుట్టు నుండి బయటపడొచ్చు. అది కూడా సింపుల్ గానే. దీని కోసం ముందు స్టవ్ ఆన్ చేసి, ఒక పాన్ పెట్టుకోవాలి. దానిలో మూడు టేబుల్ స్పూన్లు కలోంజీ గింజలు వేసుకోవాలి. ఇప్పుడు రెండు నిమిషాల పాటు, ఈ గింజలని వేపుకోవాలి.
వాటిని మిక్సీ జార్ లో వేసి, మెత్తని పౌడర్ లాగ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గింజలు పొడిని తీసుకుని, రెండు స్పూన్లు కాఫీ పొడి, నాలుగు స్పూన్లు ఆవనూనె వేసి, బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ తలకి బాగా పట్టించి, గంట నుండి గంటన్నర వరకు అలా వదిలేయాలి. ఆ తర్వాత మీరు షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. జుట్టుకి రంగు వేసుకున్నట్లుగా మీ జుట్టు మారుతుంది.
లవారానికి ఒక్కసారి ఇలా చేసినా జుట్టు రంగు మారుతుంది. ఈ చిన్న చిట్కాతో ఈజీగా మీరు తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు. తెల్ల జుట్టుకి దూరంగా ఉండాలని అనుకునే వాళ్ళు, ఈ సింపుల్ హోమ్ టిప్ ని ట్రై చేస్తే సరిపోతుంది. ఆవ నూనె వలన జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. జుట్టు కుదుళ్ళని బలోపేతం చేస్తుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. జుట్టుని నల్లగా కూడా మారుస్తుంది. చుండ్రు సమస్య నుండి కూడా ఇది దూరంగా ఉంచగలదు.