Eyebrow Growth : రాత్రి నిద్రించే ముందు దీన్ని క‌నుబొమ్మ‌ల‌కు రాస్తే.. ఒత్తుగా పెరుగుతాయి..

Eyebrow Growth : క‌నుబొమ్మ‌లు మ‌న ముఖానికి చ‌క్క‌టి అందాన్ని ఇస్తాయి. మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డ‌డంతో క‌నుబొమ్మ‌లు కూడా ముఖ్య‌మైన పాత్ర పోషిస్తాయి. ఇవి ఎంత చ‌క్క‌గా ఉంటే మ‌న ముఖం అంత అందంగా క‌న‌బడుతుంది. అయితే కొంద‌రిలో క‌నుబొమ్మ‌లు చాలా పలుచ‌గా ఉంటాయి. క‌నుబొమ్మ‌లు ఒత్తుగా, న‌ల్ల‌గా క‌న‌బ‌డడానికి చాలా మంది ఐ బ్రో పెన్సిల్స్ ను ఉప‌యోగిస్తూ ఉంటారు. వీటిని ఉప‌యోగించే అవ‌స‌రం లేకుండా కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల చాలా సులభంగా క‌నుబొమ్మ‌ల‌ను న‌ల్ల‌గా, ఒత్తుగా మార్చుకోవ‌చ్చు. క‌నుబొమ్మ‌ల‌ను ఒత్తుగా మార్చే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఉల్లిపాయ ర‌సాన్ని, కొబ్బ‌రి నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాలి. త‌రువాత అందులో ఒక టీ స్పూన్ కొబ్బ‌రి నూనెను వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మంలో దూదిని ముంచి క‌నుబొమ్మ‌ల‌పై రాసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రాత్రి ప‌డుకునే ముందు క‌నుబొమ్మ‌ల‌పై రాసుకుని ఉద‌యాన్నేక‌డిగి వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వారం రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల క‌నుబొమ్మ‌లు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతాయి. అలాగే క‌నుబొమ్మ‌ల‌ను అందంగా మార్చే మ‌రో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Eyebrow Growth remedy in telugu works effectively
Eyebrow Growth

ఈ చిట్కాను ఉప‌యోగించ‌డానికి గానూ మ‌నం ఆముదం నూనెను, విట‌మిన్ ఇ క్యాప్సుల్స్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల ఆముదం నూనెను తీసుకోవాలి. త‌రువాత అందులో రెండు విట‌మిన్ ఇ క్యాప్సుల్స్ ను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని దూదితో లేదా చేతి వేళ్ల‌తో క‌నుబొమ్మ‌ల‌పై రాసి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని కూడా రాత్రి ప‌డుకునే ముందు క‌నుబొమ్మ‌ల‌కు రాసుకుని ఉద‌యాన్నే క‌డిగి వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మ‌న క‌నుబొమ్మ‌లు అందంగా మార‌తాయి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మ‌నం మ‌న క‌నుబొమ్మ‌ల‌ను ఒత్తుగా, న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు.

D

Recent Posts