నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో జుట్టు రాలడం అనేది చాలా మందికి సమస్యగా మారింది. తమ జుట్టు పూర్తిగా రాలిపోతుందమోనని చాలా మంది భయపడుతుంటారు. దీంతో రసాయనాలు ఎక్కువగా ఉండే హెయిర్ ట్రీట్‌మెంట్ విధానాలను అనుసరిస్తుంటారు. అయితే ఎక్కువ ఖర్చు పెట్టి అలాంటి పద్ధతులను పాటించాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే జుట్టు రాలకుండా ఆపవచ్చు. అలాగే శిరోజాలు పొడవుగా, మృదువుగా, ఒత్తుగా పెరుగుతాయి.
చాలా మందికి జుట్టు పొడిబారి చిట్లుతుంటుంది. దీనికి కారణం జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండకపోవడమే. వాటికి సరైన పోషణ లభించదు. ఈ కారణంగానే జుట్టు దెబ్బ తింటుంది. దీంతోపాటు శిరోజాలు పొడిబారి చిట్లుతాయి. అయితే ఈ చిట్కాలను పాటించడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు.
1. కోడిగుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని శిరోజాలకు వాడడం వల్ల చుండ్రు తగ్గుతుంది. అలాగే సూర్యకాంతి, చెమట వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. గుడ్డు పచ్చని సొనలో 2 టీస్పూన్ల నిమ్మరసం కలిపి బాగా మిశ్రమంగా చేసి దాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా రాయాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే జుట్టుకు పోషణ లభిస్తుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.
2. ఆలివ్ ఆయిల్‌తో రాత్రి పూట తలకు మర్దనా చేస్తుండాలి. వారంలో కనీసం ఇలా 3 రోజుల పాటు చేస్తే జుట్టుకు కావల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. జుట్టు పొడవుగా పెరుగుతుంది. మృదువుగా మారుతుంది.
3. మందార పువ్వుల గుజ్జు, కొబ్బరినూనెలను బాగా కలిపి మిశ్రమంగా చేసి దాన్ని జుట్టుకు రాయాలి. 15 నిమిషాల పాటు ఉన్నాక తలస్నానం చేయాలి. వారంలో ఇలా 2-3 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
4. కోడిగుడ్డులోని పచ్చనిసొన, తేయాకు నీళ్లు (డికాషన్), హెన్నాలను కలిపి మిశ్రమంగా చేసి తలకు రాయాలి. తరువాత ఆరిపోతుంది. అనంతరం తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు సమస్యలు తగ్గుతాయి.
5. నువ్వుల నూనెతో తరచూ తలకు మర్దనా చేస్తూ ఉండాలి. దీని వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి.
6. మార్కెట్‌లో విటమిన్ ఇ క్యాప్సూల్స్ లభిస్తాయి. దాన్ని విడదీసి అందులో ఉండే పదార్థాన్ని సేకరించాలి. దాన్ని ఆముదంలో కలిపి మిశ్రమంలా చేయాలి. ఆ మిశ్రమాన్ని తలకు రాసి 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365