Hair Care : కోడిగుడ్లతో మీ జుట్టు సమస్యలను ఈ విధంగా తగ్గించుకోండి..!

Hair Care : కోడిగుడ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల గుడ్లను సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తారు. వీటిని రోజూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కోడిగుడ్లతో జుట్టు సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Hair Care make hair masks with eggs in this way and apply it for hair problems

మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేయాలనుకుంటే గుడ్డును ఉపయోగించి హెయిర్‌ మాస్క్‌లను తయారు చేసుకుని వాడాలి. వాటితో జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.

జుట్టుకు గుడ్డు మాస్క్ అనేది ప్రపంచంలోని సాంప్రదాయక హెయిర్‌కేర్ పద్ధతులలో ఒకటి. ఎందుకంటే ఇది జుట్టును సహజంగా తేమగా ఉండేలా చేస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోటీన్, బయోటిన్ అధికంగా ఉండే గుడ్డు హెయిర్ మాస్క్ అవసరమైన పోషణను అందిస్తుంది. దెబ్బతిన్న జుట్టుకు మెరుపును అందిస్తుంది. గుడ్డు వల్ల జుట్టు విరిగిపోకుండా ఉంటుంది.  జుట్టు పెరుగుదలను కూడా గుడ్డు ప్రోత్సహిస్తుంది.

ఒక గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్ల గుడ్డు పచ్చసొన తీసుకోండి. ఇప్పుడు 4-5 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ తీసుకోండి.  అలాగే 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె వేడి చేయండి. ఈ మూడింటిని మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుండి ప్రారంభించి మీ జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. తరువాత తలస్నానం చేయండి.

అలాగే ఇంకో మిశ్రమం కూడా జుట్టు సమస్యలకు పనిచేస్తుంది. ఇందుకు గాను గుడ్డు, పెరుగు, నిమ్మరసంలను వాడాలి. ఒక గుడ్డును కొట్టి దాంట్లోని సొన తీసి అందులో 3-4 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో నెమ్మదిగా జుట్టు మీద మాస్క్ లా అప్లై చేయాలి. తరువాత ఒక గంట పాటు అలాగే ఉంచాలి. అనంతరం తలస్నానం చేయాలి.

ఈ విధంగా గుడ్డుతో పైన తెలిపిన రెండు మిశ్రమాల్లో దేన్నయినా సరే హెయిర్‌ మాస్క్‌ లా వాడవచ్చు. దీంతో జుట్టు సమస్యలు పోతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు తగ్గుతుంది.

Admin

Recent Posts