బియ్యం అంటే సాధారణంగా వాటితో అన్నం వండుకుని తింటారు. కానీ నిజానికి బియ్యాన్ని శిరోజాల సంరక్షణకు కూడా ఉపయోగించవచ్చు. బియ్యాన్ని నానబెట్టి తయారు చేసే నీటితో శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుసుకుని వాటిని 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని వడబోయాలి. అనంతరం ఏర్పడే నీటిని శిరోజాలకు పట్టించవచ్చు. ఈ నీటిని ఒక గ్లాస్ మోతాదుగా తీసుకుని శిరోజాలకు బాగా రాయాలి. కుదుళ్లకు పట్టేలా రాస్తూ మర్దనా చేయాలి.
తరువాత 30 నిమిషాల పాటు ఉండి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా చాలు, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. బియ్యంలో శిరోజాలకు ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఈ నీళ్లను ఉపయోగించడం వల్ల తలపై ఉండే దుమ్ము, ధూళి పోతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. చుండ్రు తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది.