Lips Health : పెదవులు అందంగా, ఎర్రగా, ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి మగువ కోరుకుంటుంది. అందమైన పెదవులు మన అందాన్ని మరింత పెంచుతాయి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది పెదవులు నిర్జీవంగా మారడం, వాటి సహజ రుంగును కోల్పోయి నల్లగా మారడం, పెదవులు పగలడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెదవులు పగలడం అనే సమస్య చలికాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది. పెదవులు నల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, ఎండలో ఎక్కువగా తిరగడం, పొగాకును ఎక్కువగా నమలడం, ధూమపానం, కాఫీ మరియు టీ లను ఎక్కువగా తాగడం, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల పెదవులు నల్లగా మారతాయి. అలాగే రసాయనాలు కలిగిన లిప్ స్టిక్ లను వాడడం వల్ల కూడా పెదవులు నిర్జీవంగా, అందవిహీనంగా తయారవుతాయి.
కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించి మనం మన పెదవులను అందంగా, ఎర్రగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. పెదవులు అందంగా ఉండాలనుకునే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో బ్రౌన్ షుగర్ ను తీసుకోవాలి. తరువాత అందులో కొబ్బరి నూనెను కలిపి 10 నిమిషాల పాటు ఫ్రిజ్ ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పెదవులపై రాసి సున్నితంగా రుద్దాలి. పది నిమిషాల తరువాత నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల పెదవుల పై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. కొబ్బరి నూనె పెదవులకు చక్కటి మాయిశ్చరైజర్ లా పని చేసి పెదవుల పగుళ్లను నివారిస్తుంది.
ఈ చిట్కాను తరచే వాడడం వల్ల అందమైన పెదవులను మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే బీట్ రూట్ రసంలో కొద్దిగా మీగడను కలిపి పెదవులకు రాసుకోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు పెదవులకు రాసుకుని ఉదయాన్నే నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల పెదవులు సహజంగా ఎరుపు రంగును సొంతం చేసుకుంటాయి. అలాగే పెదవుల పగుళ్లు కూడా తగ్గుతాయి. అలాగే రోజూ పెదవులకు బాదం నూనె రాయడం వల్ల పెదవులు నల్ల రంగును వదిలి ఎర్రగా తయారవుతాయి. అలాగే పెరుగులో తేనె, నిమ్మరసం కలిపి పెదవులకు రాసి మర్దనా చేయాలి. గంట తరువాత నీటితో కడిగి వేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పెదవులు మృదువుగా మారతాయి. పెదవులకు సంబందించిన సమప్యలతో బాధపడే వారు ప్రతిరోజూ పెదవులకు కీరదోస రసాన్ని రాసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది.
అదే విదంగా పెరుగులో టమాట రసాన్ని కలిపి రాయడం వల్ల కూడా పెదవులు మంచి రంగును సొంతం చేసుకుంటాయి. అలాగే పెదవులు మృదువుగా తయారవుతాయి. పెదాల పగుళ్లను నివారించడానికి చాలా మంది బయట దొరికే లిప్ బామ్ లను వాడుతూ ఉంటారు. వీటికి బదులుగా మన ఇంట్లో ఉండే వెన్నను తీసుకుని పెదవులకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి. అలాగే పాలల్లో గులాబి రేకులను వేసి నానబెట్టాలి. తరువాత అందులో బాదం పప్పు పేస్ట్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకోవడం వల్ల పెదవులు ఎర్రగా మారడంతో పాటు మృదువుగా తయారవుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి ఖర్చు లేకుండా పెదవులను అందంగా, మృదువుగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.