Rose Water : భారతీయులు రోజ్ వాటర్‌ను ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్‌తో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ముఖ్యంగా ఆయుర్వేదం రోజ్‌వాటర్‌ను ఉపయోగించాలని సూచిస్తోంది. ఈ క్రమంలోనే రోజ్ వాటర్ వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజ్ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇది చర్మంపై వచ్చే దద్దుర్లను పోగొడుతుంది. దురద నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. గజ్జి, తామర, చర్మంపై ఉండే ఎర్రని మచ్చలు వంటి వాటిని రోజ్ వాటర్ తొలగిస్తుంది. అందుకు గాను రోజ్ వాటర్‌న రోజూ రాత్రి పూట కొన్ని చుక్కలు తీసుకుని సమస్య ఉన్న చోట రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా సమస్య తగ్గే వరకు చేయాల్సి ఉంటుంది.
2. మొటిమలు అయి తగ్గిపోయినా, గాయాలు, దెబ్బలు తగిలి మానిపోయినా.. పలు ఇతర కారణాల వల్ల కూడా చర్మంపై డార్క్ స్పాట్స్ ఏర్పడుతుంటాయి. అలాంటి వాటిని రోజ్ వాటర్ తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా రోజ్ వాటర్‌ను ఉపయోగించడం వల్ల డార్క్ స్పాట్స్ పోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
3. రోజ్ వాటర్‌ను రోజూ నిద్రించే ముందు ముఖానికి రాయాలి. మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే వయస్సు మీద పడడం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. దీంతోపాటు కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు కూడా తగ్గుతాయి.
4. శరీరంలో ఏ చోటనైనా సరే నల్లని మచ్చలు ఏర్పడుతుంటే రోజ్ వాటర్‌ను రాస్తుంటే తగ్గిపోతాయి.
మార్కెట్‌లో మనకు రోజ్ వాటర్ లభిస్తుంది. అయితే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కానీ దీన్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కొన్ని గులాబీ పువ్వుల రెక్కలను తీసుకుని ఒక పాత్రలోని నీటిలో వేయాలి. అనంతరం మూత పెట్టి సన్నని మంటపై నీటిని మరిగించాలి. నీరు బాగా మరిగాక చల్లార్చాలి. అనంతరం రెక్కలను వడకట్టేయాలి. ఆపై వచ్చే రోజ్ వాటర్‌ను గాజు సీసాలో భద్ర పరుచుకుని రోజూ ఉపయోగించవచ్చు.