Stretch Marks : అధిక బరువు సమస్యతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. స్త్రీలల్లో పిరుదులు, తొడల భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. అలాగే పురుషుల్లో పొట్ట భాగంలో, వీపు భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల చర్మం సాగీ చారలు ఏర్పడుతుంటాయి. పొట్ట, నడుము భాగంలో, భుజాలు, తొడలు, చంకల భాగాల్లో ఎక్కువగా చర్మంపై చారలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరిలో ఈ సమస్యను మనం చూడవచ్చు. చాలా మంది చర్మంపై ఉండే ఈ చారలను తొలగించుకోవడానికి ఆయింట్ మెంట్ లను, వివిధ రకాల నూనెలను రాస్తూ ఉంటారు. ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా మనం చర్మం పై ఉండే ఈ చారలను తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ఏర్పడిన చారలను తొలగించే ఈ చిట్కా ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మంపై చారలను తొలగించడంలో మనకు జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చర్మం పై చారలు ఉన్న చోట లేపనంగా రాయాలి. అలాగే చారలు ఏర్పడే అవకాశం ఉన్న వారు భాగంలో ఈ జామ ఆకుల పేస్ట్ ను రాయడం వల్ల భవిష్యత్తులో చర్మం పై చారలు ఏర్పడకుండా ఉంటాయి. జామ ఆకుల్లో ఉండే లైకోపిన్ చర్మం పై ఉండే చారలను తగ్గించడంలో అలాగే చారలు భవిష్యత్తులో ఏర్పడకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే అధికంగా ఉండే విటమిన్ సి చర్మ లోపల ఉండే కొలాజెన్ ను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
జామ ఆకుల పేస్ట్ ను రాసుకోవడం వల్ల చర్మం లోపల ఇన్ ప్లామేషన్ తగ్గి చారలు తగ్గడంతో పాటు మరలా అవి రాకుండా ఉంటాయి. చర్మం పై చారలను తగ్గించడంలో జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో సైతం వెల్లడైంది. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల జామ ఆకుల పేస్ట్ లో కొద్దిగా కలబంద గుజ్జు, ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చారలపై రాసి మర్దనా చేయాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం పై ఉండే చారలు చాలా సులభంగా తగ్గుతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే మంచి నీటిని ఎక్కువగా తాగడం వల్ల చర్మం పై ఉన్న చారలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.