తెల్ల‌గా ఉండే జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

మ‌న‌లో కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. సాధార‌ణంగా వృద్ధాప్య ఛాయ‌లు మీద ప‌డుతున్న వారికి జుట్టు తెల్ల‌బ‌డుతుంది. కానీ యుక్త వ‌య‌స్సులో వెంట్రుక‌లు తెల్ల‌బ‌డుతున్నాయి అంటే ఏదో స‌మ‌స్య ఉంద‌ని అర్థం. అయితే తెల్ల‌ని జుట్టును న‌ల్ల‌గా మార్చుకునేందుకు ఆయుర్వేదంలో ప‌లు అద్భుత‌మైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

turn white hair into black hair follow these ayurvedic remedies

* పాలకూర ఆకులు, కరివేపాకుల‌ను సమానంగా తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా ప‌ట్టుకోండి. అనంత‌రం దాని నుంచి ర‌సం తీయండి. ఆ ర‌సాన్ని ఒక క‌ప్పు మోతాదులో ఉద‌యాన్నే ప‌ర‌గడుపునే తాగండి.

* మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగండి.

* సాయంత్రం 6 గంటల సమయంలో ఉసిరికాయ‌ జ్యూస్ ను రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా క‌లిపి తాగాలి.

* రాత్రి పడుకునే ముందు మునగాకు పౌడర్ ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా క‌లిపి తాగండి.

పైన తెలిపిన చిట్కాల‌ను రోజూ పాటించాలి. 90 రోజుల పాటు ఇలా చేస్తే త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.

– స్పంద‌న చౌద‌రి,
హైద‌రాబాద్.

Share
Admin

Recent Posts