చిట్కాలు

ఈ మొక్క‌కు చెందిన ఔష‌ధాన్ని వాడితే కిడ్నీ స్టోన్లు ఇట్టే క‌రిగిపోవటే కాదు. ఇక మ‌ళ్లీ రావు..!

కిడ్నీ స్టోన్లు… మూత్ర‌పిండాల్లో కాల్షియం, ఆగ్జ‌లేట్స్ వంటివి పేరుకుపోవ‌డం వ‌ల్ల ఇవి ఏర్ప‌డుతాయి. అదేవిధంగా గాల్ స్టోన్స్‌… పైత్య ర‌సంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఏర్ప‌డుతాయి. ఈ రెండింటిలో ఏవి ఏర్ప‌డినా మ‌న శ‌రీరానికి ప్ర‌మాద‌మే. ప్ర‌ధానంగా క‌డుపులో నొప్పి, వికారం వంటి స‌మ‌స్య‌లు క‌లుగుతాయి. భరించ‌లేని నొప్పి ఉంటుంది. ఈ క్రమంలో అవి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా దారి తీసేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే గాల్ స్టోన్స్ లేదా కిడ్నీ స్టోన్స్ ఏవైనా త్వ‌రిత గ‌తిన క‌రిగిపోవాల‌న్నా, మళ్లీ రాకుండా ఉండాల‌న్నా ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ అద్భుత‌మైన మొక్క‌కు చెందిన ఔష‌ధాన్ని క‌నీసం ఒక 3 నెల‌ల పాటు వాడాల్సి ఉంటుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇదే మొక్క‌ను పలు ర‌కాల హోమియోప‌తి మందుల త‌యారీలోనూ ఉప‌యోగిస్తున్నారు. ఆ మొక్కే బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ (Berberis Vulgaris).

బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ మొక్క‌కు చెందిన వేళ్లు, ఆకుల నుంచి తీసిన ప‌లు ర‌కాల ఔషధ ప‌దార్థాల‌ను ఆర్గానిక్ ఆల్క‌హాల్‌తో క‌లిపి మిశ్ర‌మంగా చేసి త‌యారు చేసే బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ ఔష‌ధం మ‌న‌కు హోమియోప‌తి మందుల షాపులు లేదా ఆన్‌లైన్‌లోనూ ల‌భ్య‌మ‌వుతోంది. ఇది ద్ర‌వ రూపంలో ఉంటుంది. దీన్ని తీసుకుని రోజుకు 3 లేదా 4 సార్లు (తీవ్రత ఎక్కువ ఉంటే) ఈ ద్ర‌వాన్ని 20 నుంచి 30 చుక్క‌ల మోతాదులో సేవించాలి. ఇలా క‌నీసం 3 నెల‌ల పాటు ఈ ఔష‌ధాన్ని సేవించాల్సి ఉంటుంది. రాళ్లు పెద్ద సైజ్‌లో ఉంటే ఇంకా ఎక్కువ స‌మ‌య‌మే ప‌ట్ట‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ కిడ్నీ స్టోన్లు లేదా గాల్ స్టోన్స్ క‌రిగిపోతాయి. దీంతో ఇక అవి మ‌ళ్లీ రావు.

berberis vulgaris plant medicine can be used to remove kidney and gall stones

పైన చెప్పిన బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ ఔష‌ధం కిడ్నీ స్టోన్లు, గాల్ స్టోన్ల‌కే కాదు, ఇంకా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ లో ఉన్న ఔష‌ధ గుణాలు లివ‌ర్ స‌మ‌స్య‌ల‌ను పోగొడ‌తాయి. ప‌చ్చ‌కామెర్ల ఎంత తీవ్రంగా ఉన్నా న‌య‌మైపోతాయి. రోజుకు 2 నుంచి 3 సార్లు 1/4 టీస్పూన్ మోతాదులో దీన్ని సేవిస్తున్న‌ట్ట‌యితే అన్ని ర‌కాల లివ‌ర్ రోగాలు తొల‌గిపోతాయి. హై బీపీ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ర‌క్త నాళాలు తెర‌చుకుని ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. టైఫాయిడ్ వంటి విష జ్వ‌రాలు త‌గ్గిపోతాయి. చిగుళ్ల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. స్త్రీల‌లో వ‌చ్చే రుతు సంబంధ స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. అయితే ఈ బ‌ర్బెరిస్ వ‌ల్గ‌రిస్ ఔష‌ధాన్ని ఎలాంటి స‌మ‌స్య‌లు లేని వారు వాడ‌కూడ‌దు. లేదంటే ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ క‌లిగేందుకు అవ‌కాశం ఉంటుంది. డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు ఈ ఔష‌ధాన్ని వాడుకోవాలి.

Admin

Recent Posts