Bhringraj Powder For Hair : వాతావరణ కాలుష్యం, మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది వివిధ రకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం, జుట్టు చిట్లడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడే వారు నేటి తరుణంలో ఎక్కువవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలన్నింటిని నుండి బయట పడి జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అనేక రకాల నూనెలను, షాంపులను వాడుతూ ఉంటారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేకపోవడం చేత తీవ్ర నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు మన ఇంట్లోనే సహజ సిద్దంగా లభించే పదార్థాలతో పేస్ట్ ను తయారు చేసుకుని వాడడం వల్ల చాలా సులభంగా జుట్టు సమస్యలన్నింటి నుండి బయట పడవచ్చు. ఈ చిట్కాను వారానికి ఒకసారి వాడితే చాలు జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టును ఒత్తుగా పెంచే చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల బృంగరాజ్ పౌడర్ ( గుంటగలగరాకు పొడి)ని తీసుకోవాలి.
తరువాత ఇందులో రెండు టీ స్పూనన్ల ఉసిరికాయ పొడి వేసి కలపాలి. తరువాత రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనె, నాలుగు టీ స్పూన్ల పెరుగు వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచిన తరువాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు చిట్లడం, చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ పేస్ట్ తయారీలో వాడిన ప్రతి పదార్థం కూడా జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలంగా మార్చడంలో సహాయపడతాయి. ఇలా పేస్ట్ ను తయారు చేసుకుని వారానికి ఒకసారి వాడడం వల్ల జుట్టు నల్లగా, పొడవుగా , కాంతివంతంగా మారుతుంది.