Bloating : చాలా మందికి భోజనం చేసిన వెంటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. వెంటనే గ్యాస్ చేరిపోతుంది. తక్కువ ఆహారం తీసుకున్నా చాలు కొందరికి ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. దీంతో భోజనం చేయాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక నలుగురిలో ఉన్నప్పుడు అయితే భోజనం సరిగ్గా చేయలేకపోతుంటారు. దీన్నే కొందరు గ్యాస్ అనుకుంటారు. కానీ గ్యాస్ట్రిక్ సమస్య వేరు, కడుపు ఉబ్బరం వేరు. గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే గ్యాస్ పదే పదే రిలీజ్ అవుతుంది. కానీ కడుపు ఉబ్బరం వస్తే గ్యాస్ ఒక పట్టాన బయటకు పోదు. పొట్టలో అలాగే ఉంటుంది. దీంతో ఇబ్బందులు పడతారు. అయితే మీలో ఎవరికైనా ఇలా తిన్న వెంటనే కడుపు ఉబ్బరం సమస్య వస్తుంటే అందుకు చింతించాల్సిన పనిలేదు. ఈ కింద చెప్పిన సహజసిద్ధమైన ఇంటి చిట్కాలను పాటించండి చాలు, దీంతో కడుపు ఉబ్బరం వెంటనే తగ్గిపోతుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కొందరికి కారం లేదా మసాలా, పుల్లని ఆహారం తింటే కడుపు ఉబ్బరం వస్తుంది. అలా జరిగితే ఆ ఆహారాలను మానేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏ ఆహారం తిన్నా కడుపు ఉబ్బరం వస్తుందంటే అప్పుడు ఈ చిట్కాలను పాటించాలి. భోజనం చేసిన వెంటనే నాలుగు పుదీనా ఆకులను బుగ్గన వేసుకుని అలాగే నమిలి మింగాలి. దీంతో గ్యాస్ పోతుంది, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అలాగే ఒక గ్లాస్‌లో చిటికెడు వంట సోడా కలిపి తాగినా చాలు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. భోజనం చేసిన వెంటనే ఒక కీరదోసను నేరుగా అలాగే తినాలి లేదా ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను తినాలి.
సోంపు గింజలతో తయారు చేసిన టీని తాగుతున్నా కూడా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. కొందరు భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ వంటివి తాగుతారు. ఇలా చేయకూడదు, ఇవి గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలను పెంచుతాయి. ఇక కమోమిల్ టీని తాగుతున్నా కూడా కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. ఇది గ్యాస్ నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. రాత్రి పూట ఈ టీని సేవిస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి, నిద్ర చక్కగా పడుతుంది, పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నానబెట్టిన బాదంపప్పులను నాలుగైదు తిన్నా కూడా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో కలబంద రసం సేవించాలి. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం టీ, కాఫీలకు బదులుగా యాపిల్ పండును లేదా ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ తాగాలి. అలాగే పరగడుపునే చిన్న అల్లం ముక్కను నమిలి తినవచ్చు. ఒక టీస్పూన్ అల్లం రసం సేవించినా చాలు. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే సమస్య నుంచి సత్వరమే ఉపశమనం పొందవచ్చు.