Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

షుగర్‌ లెవల్స్‌ను తగ్గించే మామిడి ఆకులు.. ఎలా ఉపయోగించాలంటే..?

Admin by Admin
June 20, 2021
in చిట్కాలు
Share on FacebookShare on Twitter

ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్నారు. కేవలం భారతదేశంలోనే సుమారుగా 5 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులను వాడాల్సి వస్తోంది. కొందరికి డయాబెటిస్‌ నియంత్రణలో ఉండడం లేదు. అయితే మామిడి ఆకులను ఉపయోగించి షుగర్‌ లెవల్స్‌ను అదుపు చేయవచ్చు. ఈ చిట్కాను ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఆస్తమా సమస్య కూడా తగ్గుతుంది.

blood sugar levels can be reduced with mango leaves take in this way

మామిడి ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి డయాబెటిస్‌ ఉన్నవారికి మేలు చేస్తాయి. షుగర్‌ లెవల్స్‌ను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. 2010లో సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం మామిడి ఆకుల నుంచి తీసిన పదార్థాలను తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గాయని తేలింది. అందువల్ల వీటిని ఉపయోగించి డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు.

మామిడి ఆకులను 15 తీసుకుని వాటిని బాగా కడిగి 100 లేదా 150 ఎంఎల్‌ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. తరువాత రోజు ఉదయాన్నే ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల మూడు నెలల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

మామిడి ఆకులతో తయారు చేసే కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది గ్లూకోజ్‌ను సక్రమంగా వినియోగం అయ్యేలా చేస్తుంది. దీని వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మామిడి ఆకుల్లో పెక్టిన్‌, ఫైబర్‌, విటమిన్‌ సి ఉంటాయి. అందువల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతోపాటు కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా తగ్గుతాయి.

ఇక డయాబెటిస్‌ వల్ల రాత్రి పూట కొందరు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు. కానీ మామిడి ఆకుల నీటిని తాగితే ఆ ఇబ్బంది ఉండదు. కంటి చూపు మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గుతారు. మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: blood sugar levelsDiabetesmango leavestype 1 diabetesType 2 Diabetesటైప్ 1 డ‌యాబెటిస్టైప్ 2 డ‌యాబెటిస్డ‌యాబెటిస్బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్మ‌ధుమేహంమామిడి ఆకులుర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు
Previous Post

వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలను తీసుకోవాలి..!

Next Post

యాంటీ బయోటిక్స్‌, యాంటీ వైరల్‌ మందులను ఎక్కువగా వాడితే ముప్పే.. ఈ సహజసిద్ధమైన పదార్థాలను తీసుకోండి..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025
చిట్కాలు

సీతాఫ‌లం ఆకుల‌తో ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా.. తెలిస్తే వెంట‌నే వాడుతారు..!

June 1, 2025
చిట్కాలు

కరివేపాకును అలా తీసిపారేయకండి..! అందులో ఉన్న ఔషధగుణాలను తెలుసుకోండి..!

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
చిట్కాలు

క‌డుపులో మంట‌గా ఉందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు..

May 31, 2025
చిట్కాలు

ముఖంపై ట్యాన్ పెరిగి న‌ల్ల‌గా మారింది.. ఈ చిట్కాను పాటిస్తే చాలు..

May 29, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!