Raw Banana : మనకు అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండ్లు ఒకటి. వీటిల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవన్నీ మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. ఈ క్రమంలోనే రోజూ అరటి పండ్లను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి అరటి కాయలు ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు. పచ్చి అరటి కాయలను రోజూ తింటుంటే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఈ మేరకు సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
పచ్చి అరటి కాయలను బాగా కడిగి శుభ్రం చేసి వాటికి ఉడికించాలి. అనంతరం వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు రోజూ తినే ఆహారాల్లో కలిపి తినాలి. ఈ విధంగా తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అయితే పచ్చి అరటికాయలను ఉడకబెట్టాల్సిన పనిలేదని అనుకునేవారు నేరుగా కూడా తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
పచ్చి అరటి కాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు సి, బి6, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. సీజనల్‌గా వచ్చే వ్యాధులు తగ్గుతాయి.
పచ్చి అరటికాయలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం, గ్యాస్, కడుపులో మంట సమస్యలు తగ్గుతాయి.
అధిక బరువు తగ్గాలనుకునేవారు పచ్చి అరటికాయలను తినడం వల్ల మేలు జరుగుతుంది. బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.
పచ్చి అరటికాయలను తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. రోజూ అలసట, నీరసం ఉందని భావించేవారు పచ్చి అరటికాయలను తినడం వల్ల శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా పనిచేస్తారు.
పచ్చి అరటికాయలను కూరగా చేసుకుని కూడా తినవచ్చు. వీటి ముక్కలతో జ్యూస్ తయారు చేసుకుని ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. ఎలా తీసుకున్నా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి అరటికాయలతో అనేక లాభాలను పొందవచ్చు.