Cough Home Remedy : చాలామంది దగ్గు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దగ్గు తగ్గాలంటే, కనీసం ఒక వారం సమయమైనా పడుతుంది. దగ్గు వచ్చిందంటే, దాని నుండి బయటపడడం అంత ఈజీ కాదు. పిల్లలు మొదలు పెద్దల వరకు, చాలామంది దగ్గుతో సఫర్ అవుతుంటారు. ముఖ్యంగా, ఇది చలికాలం కావడంతో, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దగ్గు తగ్గాలంటే, ఆరోగ్య నిపుణులు చెప్పిన ఈ విషయాలని పాటించడం మంచిది. వెంటనే దగ్గు నుండి రిలీఫ్ కలుగుతుంది.
దగ్గు వచ్చిందంటే, దగ్గినప్పుడు శరీరం అంతా కూడా కదిలిపోతూ ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది. దగ్గు తగ్గి రిలీఫ్ కలగాలంటే ఇలా చేయడం మంచిది. దగ్గు, జ్వరం లేదంటే గొంతు నొప్పి, రొంప వంటి సమస్యలు ఉన్నట్లయితే వేడి వేడి నీళ్లు తాగితే మంచిది. వేడి వేడి నీళ్లు తాగడం వలన, ఉపశమనం లభిస్తుంది. కాచి చల్లార్చిన నీళ్లు తాగడం వలన ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. త్వరగా దగ్గు. జ్వరం అలానే డిహైడ్రేషన్ అయిపోకుండా నీళ్లను తీసుకోవడం కూడా మంచిది.
నీళ్లను తీసుకుంటూ ఉంటే, డిహైడ్రేషన్ సమస్య ఉండదు. ఇబ్బంది రాకుండా ఉండాలంటే నూనె ఉండేవి, స్పైసీగా ఉండేవి తీసుకోకండి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. కానీ, ఇలాంటి వాటిని అస్సలు తీసుకోకండి. తేనె నీళ్లు నిమ్మరసాన్ని కలుపుకుంటూ తాగండి. వేడినీళ్లలో నాలుగు స్పూన్ల వరకు తేనె. కొంచెం నిమ్మరసం వేసుకొని తీసుకోండి.
ఎప్పుడు నీరసంగా అనిపిస్తే అప్పుడు ఈ నీళ్లు తాగొచ్చు. రోజుకి నాలుగు ఐదు సార్లు కూడా ఈ నీళ్ల ని తీసుకోవచ్చు. ఈ నీళ్లు తాగుతూ మధ్య మధ్యలో మంచినీళ్లు కూడా తీసుకోండి. ఇలా, దగ్గు సమస్య ఉన్నప్పుడు ఈ విధంగా పాటించడం మంచిది. దగ్గు లక్షణాలు ఉన్నప్పుడు ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నారంటే, ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది.