Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Curd For Hair Fall : పెరుగుతో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు రాల‌దు.. పెరుగుతూనే ఉంటుంది..!

D by D
November 7, 2023
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Curd For Hair Fall : చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు మ‌న‌లో చాలా మంది త‌ల‌లో చుండ్రు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. త‌ల‌లో చ‌ర్మం పొడిబార‌డం వ‌ల్ల‌, వాత‌వ‌ర‌ణ కాలుష్యం వ‌ల్ల చుండ్రు స‌మస్య ఎక్కువ‌గా త‌లెత్తుతుంది. ఈ స‌మ‌స్య పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌రకు అంద‌రిని వేధిస్తుంది. చుండ్రు కార‌ణంగా త‌ల‌లో దుర‌ద‌, జుట్టు రాల‌డం, చికాకు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి కొంద‌రిలో ఈ స‌మ‌స్య ఏ మాత్రం తగ్గ‌దు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గ‌డంతో పాటు చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఈ చిట్కాల‌ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం.

అలాగే వీటిని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుందే త‌ప్ప ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. చుండ్రు స‌మ‌స్య‌ను త‌గ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో 4 టీ స్పూన్ల పెరుగు, అర చెక్క నిమ్మ‌ర‌సం, ఒక టీస్పూన్ ఆవ‌నూనె వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు బాగా ప‌ట్టించి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. త‌రువాత కుంకుడు ర‌సంతో త‌ల‌స్నానం చేయాలి. వారానికి ఒక‌సారి ఇలా చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుతుంది. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల త‌ల‌చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది.

Curd For Hair Fall follow this wonderful remedy
Curd For Hair Fall

త‌ల‌లో ఇన్పెక్ష‌న్, దుర‌ద వంటివి త‌గ్గుతాయి. అలాగే ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల పెరుగు, 5 లేదా 6 టీ స్పూన్ల ఉల్లిపాయ ర‌సం వేసి బాగా క‌ల‌పాలి. తరువాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు బాగా ప‌ట్టించి గంట పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల జుట్టు రాలే స‌మ‌స్య క్ర‌మంగా తగ్గుతుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గి జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య‌తో పాటు జుట్టు రాలే స‌మస్య కూడా త‌గ్గుతుంది.

Tags: Curd For Hair Fall
Previous Post

Mixed Veg Paratha : మిక్స్‌డ్ వెజిట‌బుల్ ప‌రాటాల‌ను ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతాయి..!

Next Post

Instant Poha Sweet : అటుకుల‌తో ఇలా చాలా త్వ‌ర‌గా 10 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్‌గా స్వీట్ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Related Posts

వినోదం

RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

July 13, 2025
వైద్య విజ్ఞానం

పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

July 13, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు అర్థ‌నారీశ్వ‌రుడు ఎలా అయ్యాడు..?

July 13, 2025
ఆధ్యాత్మికం

ఎలాంటి ప్ర‌మిద‌తో దీపారాధ‌న చేస్తే ఏ ఫ‌లితం క‌లుగుతుందో తెలుసా..?

July 13, 2025
ఆధ్యాత్మికం

దైవానికి ప్ర‌సాదం ఎందుకు పెడ‌తారు..? అందులో ఉన్న ప్రాధాన్య‌త ఏమిటి..?

July 13, 2025
vastu

పడక గది ఏ మూలన ఉంటే మీకు మంచి జరుగుతుందో తెలుసా?

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.