Curd With Methi : మెంతులు.. ఇవి మనందరికి తెలిసినవే. మెంతులు చేదు రుచిని కలిగి ఉంటాయి. మెంతులను కూడా మనం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. మెంతులు ఔషధ లక్షణాలను కలిగి ఉన్నాయి. వీటిని వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మెంతుల్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ ఉంటుంది. మెంతులు శరీరంలో కొలెస్ట్రాల్ ను, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. మెంతులను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
మధుమేహ వ్యాధి గ్రస్తులకు మెంతులు వరం వంటివని నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడే వారు తప్పనిసరిగా మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మధుమేహాన్ని నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతులు దివ్యౌషధంగా పని చేస్తాయి. మెంతులు విష పదార్థాలను బయటకు పంపించి జీవక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. బరువు తగ్గడంలో కూడా మెంతులు మనకు సహాయపడతాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి.
బరువు తగ్గుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొలగించుకోవచ్చు. తద్వారా నడుము చుట్టు పేరుకుపోయిన కొవ్వు కరిగి నడుము సన్నగా తయారవుతుంది. మెంతులను వేయించి పొడిగా చేసుకుని తినవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఈ పొడిని నీటిలో, పెరుగులో కలిపి కూడా తీసుకోవచ్చు. మెంతి పొడిని పెరుగులో కలిపి తీసుకోవడం వల్ల అతిసారం తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బాలింతలల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. క్యాన్సర్ ను నిరోధించే లక్షణాలు కూడా మెంతులల్లో ఉన్నాయి.
చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మెంతులు మనకు సహాయపడతాయి. మెంతులు యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఈ విధంగా మెంతులు మనకు ఎంతో ఉపయోగపడతాయని మెంతులను ఏ రూపంలో తీసుకున్న కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.