చుండ్రు త‌గ్గాలంటే ఏం చేయాలి ? స‌హ‌జసిద్ధ‌మైన చిట్కాలు !

మ‌న‌లో అధిక‌శాతం మందిని త‌ర‌చూ చుండ్రు స‌మ‌స్య వేధిస్తుంటుంది. దీంతో అనేక షాంపూలు గ‌ట్రా వాడుతుంటారు. అయిన‌ప్ప‌టికీ చుండ్రు స‌మ‌స్య ప‌రిష్కారం కాదు. అయితే కింద తెలిపిన‌ చిట్కాలను పాటిస్తే చుండ్రు స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

dandruff home remedies in telugu

* వారంలో కనీసం రెండు సార్లయినా కుంకుడుకాయతో లేదా శీకాయతో త‌ల‌స్నానం చేయాలి. దీని వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టించి ఒక‌ గంట తర్వాత తల
స్నానం చేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది.

* గసగసాల‌ను మెత్తగా పేస్ట్ లా చేసుకుని తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో త‌ల‌స్నానం చేయాలి.

* ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం పిండి తలకు పట్టించి తలస్నానం చేయాలి.

* కొబ్బరి నూనెలో కర్పూరం కలుపుకుని కురులకు పట్టించి అరగంట ఆగిన తర్వాత త‌ల‌స్నానం చేస్తే
ఫలితం ఉంటుంది.

* మందార ఆకులను వేడి కొబ్బ‌రినూనెలో కలిపి తలకు రాసుకోవాలి. త‌ర్వాత కొంత సేప‌టికి త‌ల‌స్నానం చేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తే స‌మ‌స్య త‌గ్గుతుంది.

* తలస్నానం చేసే ముందు కురులకు పెరుగు పట్టించి ఆరగంట తరువాత త‌ల‌స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

* జుట్టుకు హెర్బల్ ఆయిల్ తో మసాజ్ చేయ‌డం వల్ల కూడా చుండ్రును నివారించవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts