Digestion Power : ప్రస్తుత కాలంలో మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. ఇలా అనారోగ్య సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం మన జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం అనే నిపుణులు చెబుతున్నారు. జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం వల్ల మలబద్దకం, అజీర్తి, గ్యాస్, అసిడిటి వంటి పొట్ట సంబంధిత సమస్యలతో పాటు కాలేయం సరిగ్గా పని చేయకపోవడం, ముఖం పై మొటిమలు, మచ్చలు, జుట్టు రాలడం, ఎంత ఎక్కువగా పౌష్టికాహారం తీసుకున్నప్పటికి నీరసం, అలసటగా ఉండడం వంటి అనేక రకాల సమస్యలు కూడా తలెత్తుతాయి. జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవడం వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడంతో పాటు వ్యాధులు కూడా మన దరి చేరకుండా ఉంటాయి.
మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని చక్కగా ఉంచుకోవచ్చు. ఇంటి చిట్కాను ఉపయోగించి సహజ సిద్ద పదార్థాలతో మన జీర్ణశక్తి చాలా సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా ఒక గిన్నెలో 7 నుండి 8 యాలకులను తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ పటిక బెల్లాన్ని వేసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ మిరియాలనుఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. తరువాత ఈ పదార్థాలన్నింటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా ఎక్కువ మొత్తంలో ఈ పొడిని తయారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవచ్చు.
ఇలా తయారు చేసుకున్న పొడిని అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని అర కప్పు తియ్యటి పెరుగులో వేసి కలపాలి. ఈ పెరుగును ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత తీసుకోవాలి. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు దీనిలో పటిక బెల్లాన్నికి బదులుగా బ్లాక్ సాల్ట్ ను లేదా, సాధారణ ఉప్పును ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో మెటబాలిజం పెరిగి అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడవచ్చు. ఈ చిట్కా తయారీలో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి మన జీర్ణ శక్తి మెరుగుపరచడంతో మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉపయోగపడతాయి. ఈ చిట్కాను వాడడం వల్ల గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యి అందులో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. దీంతో మన అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.