Cholesterol : దీన్ని తాగితే ర‌క్త‌నాళాలు మొత్తం క్లీన్‌.. కొలెస్ట్రాల్ పేరుకుపోదు..!

Cholesterol : ఈ మ‌ధ్య కాలంలో హార్ట్ ఎటాక్‌ల‌తో మ‌ర‌ణించే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. హార్ట్ ఎటాక్‌లు రావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. ర‌క్త నాళాలలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కూడా హార్ట్ ఎటాక్ కు కార‌ణ‌మ‌వుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ర‌క్తంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెర‌గ‌డానికి కార‌ణం.. మ‌నం తీసుకునే ఆహారమే అని చెప్ప‌వ‌చ్చు. కానీ మ‌నం తీసుకునే ప్ర‌తి ఆహారం కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెర‌గ‌డానికి కార‌ణం కాదు. మాంసాహార ఉత్ప‌త్తులను అధికంగా తీసుకోవ‌డం ద్వారా మాత్ర‌మే ర‌క్తంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెరుగుతాయి. అలాగే నూనె అధికంగా ఉండే ప‌దార్థాల‌ను తిన్నా కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెరుగుతాయి.

do like this to clean Cholesterol from your body
Cholesterol

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కొన్ని ర‌కాల హార్మోన్స్‌, ఎంజైమ్స్ కొలెస్ట్రాల్ నుండి త‌యార‌వుతాయి. ఈ ప‌నిని మ‌న శ‌రీరంలో ఉండే కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన దాని కంటే ఎక్కువ‌గా ఉంటే.. ఆ కొలెస్ట్రాల్ ర‌క్త నాళాల‌లో పేరుకు పోతుంది. దీంతో గుండెకు ర‌క్త ప్ర‌స‌ర‌ణ సాఫీగా జ‌ర‌గ‌క హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు.

ర‌క్తంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకోవ‌డానికి మ‌నం అనేక ర‌కాల మందుల‌ను వాడుతూ ఉంటాం. వీటి వ‌ల్ల మ‌న శ‌రీరానికి హాని క‌లుగుతుంది. ఈ మందుల‌ను వాడ‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌ల‌హీన ప‌డ‌డం, కిడ్నీ, కాలేయం, జీర్ణాశ‌యానికి సంబంధించిన స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ మందులు చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. అయితే ఈ స‌మ‌స్యను త‌క్కువ ఖ‌ర్చుతో, శ‌రీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా స‌హ‌జ‌సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో పరిష్క‌రించుకోవ‌చ్చు. మ‌న వంటింట్లో ఉండే వెల్లుల్లి, నిమ్మ‌కాయ ద్వారా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఇక వెల్లుల్లి, నిమ్మ‌కాయ‌ల‌ను ఎంత మోతాదులో, ఎప్పుడు తీసుకుంటే.. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.. అనే సందేహం చాలా మందికి క‌లుగుతుంది. 10 గ్రాముల వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని ముక్క‌లుగా చేయాలి. ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సంలో ఈ వెల్లుల్లి ముక్క‌ల‌ను వేసి క‌లిపి రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా వారం నుండి ప‌ది రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం అధికంగా ఉంటుంది.

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ ర‌క్తంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను త‌గ్గిస్తుంది. జీర్ణ‌క్రియ సాఫీగా జ‌ర‌గ‌డానికి కూడా ఈ మిశ్ర‌మం స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్తంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌క్కువ‌గా ఉంటే.. ర‌క్త నాళాల‌లో కొలెస్ట్రాల్ పేరుకు పోకుండా ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి.

Share
D

Recent Posts