Drink For Kidneys : మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక చక్కటి పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి. మూత్రపిండాలు మన శరీరంలో ఉండే మలినాలను వడపోసి మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. దీంతో మూత్రపిండాల్లో మలినాలు పేరుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని మనం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది మూత్రపిండాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ వీటిని పట్టించుకోకపోతే మరణం సంభవించే అవకాశం కూడా ఉంది. మూత్రపిండాల్లో మలినాలు పేరుకుపోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో రక్తం పూర్తిగా శుభ్రమవ్వదు. దీని వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ లు రావడం, మూత్రంలో మంట, మూత్రం తరచూ వస్తున్నట్టు ఉండడం, మూత్రపిండాలు ఉన్న భాగంలో నొప్పి రావడం, వాంతులు, తరచూ జ్వరం రావడం వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి.
కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల అలాగే పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం ఒక్క రోజులోనే మూత్రపిండాలను శుభ్రం చేసుకోవచ్చు. దీని వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాలను శుభ్రపరిచే పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం ధనియాలను ఉపయోగించాల్సి ఉంటుంది. మూత్రపిండాలను శుభ్రపరచడంలో ధనియాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే దీనిలో పాటు మనం జీలకర్రను, ఒక నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ధనియాలను రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నిండుగా నీటిని పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. దీని వల్ల ధనియాల్లో ఉండే ఔషధ గుణాలు నీటిలోకి వస్తాయి.
తరువాత ఈ నీటిని గిన్నెలో పోసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేడి చేయాలి.ఇలా వేడి చేసిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ నీటిని మరో 5 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో రుచి కొరకు తేనెను కూడా వేసుకోవచ్చు. అయితే దీనిని గోరు వెచ్చగా మాత్రమే తీసుకోవాలి. అలాగే రోజులో ఎప్పుడైనా దీనిని తీసుకోవచ్చు. ఇలా పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి. మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.
నెలకు ఒకటి లేదా రెండు సార్లు ఇలా తీసుకోవడం వల్ల మూత్రపిండాలను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. ఈ విధంగా ఈ చిట్కాను పాటించడం వల్ల ఎల్లప్పుడూ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.