మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్, విరేచ‌నాలు.. ఈ స‌మ‌స్య‌ల‌కు అద్భుత‌మైన ఆయుర్వేద మిశ్ర‌మాలు..!

జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు చెందిన స‌మ‌స్య‌లు అనేవి ప్ర‌తి ఒక్క‌రికీ స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, విరేచ‌నాల వంటి స‌మ‌స్య‌లు చాలా మంది అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద మిశ్ర‌మాల‌ను తాగితే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్, విరేచ‌నాలు.. ఈ స‌మ‌స్య‌ల‌కు అద్భుత‌మైన ఆయుర్వేద మిశ్ర‌మాలు..!

1. మ‌ల‌బ‌ద్ద‌కం – నెయ్యి, ఉప్పు, వేడి నీళ్లు

అర క‌ప్పు వేడి నీటిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అర టీస్పూన్ ఉప్పు క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని భోజనం చేసిన త‌రువాత తాగాలి. రాత్రి భోజ‌నం అనంత‌రం దీన్ని తాగాలి. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.

2. క‌డుపు ఉబ్బ‌రం – గోరు వెచ్చ‌ని నీళ్లు, సోంపు గింజ‌లు లేదా అల్లం

ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజ‌ల పొడి లేదా అల్లం ర‌సం, ఉప్పు క‌లిపి తాగాలి. క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గుతుంది.

3. గ్యాస్ – సోంపు గింజ‌లు, తుల‌సి ఆకులు

భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు గింజ‌ల‌ను లేదా తుల‌సి ఆకుల‌ను న‌మిలి మింగాలి. ల‌వంగాల‌ను కూడా తిన‌వ‌చ్చు. గ్యాస్ త‌గ్గుతుంది.

4. విరేచ‌నాలు

సొర కాయ జ్యూస్ లేదా ట‌మాటా జ్యూస్ లేదా అల్లం ర‌సం తాగాలి. విరేచ‌నాలు తగ్గుతాయి.

Share
Admin

Recent Posts