Fatty Liver Home Remedy : మన శరీరాన్నంతటిని డీటాక్సిఫై చేసి శరీరాన్ని కాపాడడంలో కాలేయ కణాలు మనకు ఎంతగానో సహాయపడతాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కాలేయం మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. కాలేయ ఆరోగ్యం దెబ్బతింటే మన శరీర ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మనం తీసుకునే జంక్ ఫుడ్ , ఆల్కాహాల్, బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్ కారణంగా, ఎసిడిక్ ఫుడ్ కారణంగా చాలా మందిలో ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా కాలేయ కణాలు కూడా దెబ్బతింటాయి. అలాగే సమస్య తీవ్రమయ్యే కొద్ది కణాల్లో ఉండే ఎంజైమ్ లు కణాల నుండి పూర్తిగా లీకవుతాయి.
దీని వల్ల కణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. దీంతో మన శరీర ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణిస్తుంది. ఇలా ఆల్కాహాల్, జంక్ ఫుడ్ తీసుకునే వారిలో కాలేయ కణాలు దెబ్బతినకుండా ఉండాలంటే అలాగే దెబ్బతిన్న కణాలు తిరిగి సాధారణ స్థితికి రావాలంటే కరక్కాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కరక్కాయలో ఉండే రసాయన సమ్మేళనాలు కాలేయ కణాల డిఎన్ఎ లో మార్పు తీసుకువచ్చి కాలేయ కణాలు దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి. ఈ విషయాన్ని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. అలాగే కణాల నుండి ఎంజైమ్ లు లీకవకుండా నియంత్రించడంలో కూడా కరక్కాయ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వారు, ఆల్కాహాల్ తీసుకునే వారు, జంక్ ఫుడ్ తీసుకునే వారు, ఊబకాయం సమస్యతో బాధపడే వారు, ఇతర కాలేయ సమస్యలు ఉన్నవారు కరక్కాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరక్కాయను పొడిగా చేసుకుని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల అలాగే కరక్కాయ కషాయాన్ని తీసుకోవడం వల్ల లేదా కరక్కాయను లేపనంగా చేసి తీసుకోవడం వల్ల కాలేయ కణాలు దెబ్బతినకుండా ఉంటాయని దెబ్బతిన్న కాలేయ కణాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని అలాగే కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.