Fenugreek Seeds And Amla : ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు నిర్జీవంగా మారడం వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టును ఆరోగ్యంగా, ధృడంగా ఉంచుకోవడానికి రకరకాల ప్రయాత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అనేక రకాల షాంపులను వాడుతూ ఉంటారు. షాంపులను వాడడం వల్ల కలిగే మేలు కంటే కీడే ఎక్కువగా ఉంటుంది. అలాగే షాంపులు అధిక ధరలతో కూడుకుని ఉంటాయి. ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం జుట్టును ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో, తక్కువ శ్రమతో ఈ చిట్కాలను తయారు చేసుకుని వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
జుట్టు సమస్యలను తగ్గించడంలో ఉసిరికాయ పొడి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఉసిరికాయ పొడి జుట్టుకు కండిషనర్ లా పని చేస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో దోహదపడుతుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగేలా చేయడంలో చుండ్రు సమస్యను నివారించడంలో, అలాగే పేల సమస్యను నుండి బయట పడేయడంలో కూడా ఉసిరికాయ పొడి మనకు ఉపయోగపడుతుంది. ఉసిరికాయ పొడిని ఏవిధంగా ఉపయోగించడం వల్ల మనం జుట్టు సమస్యలను నివారించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గిన్నెలో మెంతి పొడిని తీసుకోవాలి.
దీనికి సమానంగా ఉసిరికాయ పొడిని కలిపి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అదే విధంగా ఉసిరికాయ, శీకాకాయ పొడిని కలిపి పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించాలి. ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది. అలాగే జుట్టు సమస్యలు తగ్గి జుట్టు పొడవుగా పెరుగుతుంది. అలాగే నీటిలో ఉసిరికాయ పొడిని కలిపి 5 నిమిషాల పాటు వేడి చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించాలి.
ఆరిన తరువాత రసాయనాలు తక్కువగా షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, నల్లగా ధృడంగా పెరుగుతుంది. ఈ విధంగా ఉసిరికాయ పొడిని ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జుట్టు కాంతివంతంగా కూడా తయారవుతుంది. ఈ చిట్కాలను పాటిస్తూనే చక్కటి పోషకాలు కలిగిన ఆహారాన్ని వాడడం వల్ల మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.