Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

ఆయుర్వేద ప్రకారం ఈ 9 సూచ‌న‌లు పాటించి పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోండి..!

Admin by Admin
September 14, 2021
in ఆరోగ్యం, చిట్కాలు
Share on FacebookShare on Twitter

శ‌రీరం మొత్తం స‌న్న‌గా ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రికి పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో శ‌రీరాకృతి హీనంగా క‌నిపిస్తుంది. దీని వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతుంటారు. ఇక అధిక బ‌రువు ఉండేవారికి కూడా పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. అది ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం కింద తెలిపిన 9 సూచ‌న‌లు పాటిస్తే దాంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే..

ఆయుర్వేద ప్రకారం ఈ 9 సూచ‌న‌లు పాటించి పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోండి..!

1. రోజూ మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో జీర్ణ‌శ‌క్తి ఎవ‌రికైనా ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల రోజులో తినే ఆహారంలో ఎక్కువ మొత్తాన్ని ఆ స‌మ‌యంలోనే తినాలి. మీరు రోజూ తిన‌డం వ‌ల్ల వ‌చ్చే క్యాల‌రీల్లో 50 శాతం క్యాల‌రీలను మ‌ధ్యాహ్నం భోజనంతోనే అందేలా చూసుకోవాలి. అంటే మీరు రోజుకు 2000 క్యాల‌రీల శ‌క్తినిచ్చే ఆహారాల‌ను మూడు పూట‌లా తింటుంటే.. అందులో 50 శాతం.. అంటే.. 1000 క్యాల‌రీల శ‌క్తిని ఇచ్చే ఆహారాల‌ను మ‌ధ్యాహ్నం పూట తినాల‌న్న‌మాట‌. మిగిలిన దాంట్లో అధిక భాగాన్ని పొద్దున తినాలి. త‌రువాత చాలా స్వ‌ల్ప మొత్తంలో క్యాల‌రీలు అందేలా రాత్రి భోజ‌నం చేయాలి. అది కూడా రాత్రి 7 లోపు భోజ‌నం చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, అధిక బ‌రువు త‌గ్గుతారు.

2. పిండి ప‌దార్థాల‌ను అధికంగా తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అది పొట్ట ద‌గ్గ‌ర చేరుతుంది. క‌నుక కార్బొహైడ్రేట్ల‌ను త‌క్కువ‌గా తినాలి. ప్రోటీన్లు, కొవ్వుల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. కొవ్వులు అంటే.. ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు. అవి వృక్ష సంబంధ ప‌దార్థాల్లో ఉంటాయి. న‌ట్స్, ఆలివ్ ఆయిల్, విత్త‌నాలు లాంటివ‌న్న‌మాట‌. వాటిని తింటే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ల‌భిస్తాయి.

3. రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల మెంతుల‌ను నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం ప‌ర‌గడుపునే ఆ నీటిని తాగుతుండాలి. దీంతో పొట్ట క‌రిగి ఫ్లాట్‌గా మారుతుంది.

4. Garcinia Cambogia అన‌బ‌డే మూలిక‌కు చెందిన ట్యాబ్లెట్ల‌ను రోజూ వాడ‌వ‌చ్చు. దీన్నే వృక్ష‌మాల అంటారు. ఆయుర్వేద మందుల షాపుల్లో ల‌భిస్తాయి. వీటిని తీసుకుంటే శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి.

5. త్రిఫ‌ల చూర్ణంను రోజూ తీసుకోవాలి. రాత్రి పూట అర టీస్పూన్ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లుపుకుని తాగుతుండాలి. దీంతో జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. కొవ్వు క‌రుగుతుంది.

6. రోజూ ఉద‌యం సాయంత్రం కొద్దిగా అల్లాన్ని నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని తాగుతుండాలి. దీంతో శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు.

7. రోజూ ఖాళీ క‌డుపుతో ఉద‌యం క‌నీసం 30 నిమిషాల పాటు వేగంగా న‌డ‌వాలి. దీని వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు.

8. ఎట్టి ప‌రిస్థితిలోనూ చ‌ల్ల‌ని నీటిని తాగ‌రాదు. గోరు వెచ్చ‌ని నీటినే తాగాలి. ఇది మెట‌బాలిజంను పెంచుతుంది. దీంతో బ‌రువు త‌గ్గ‌డం తేలిక‌వుతుంది.

9. ఆహారాన్ని స‌రిగ్గా న‌మ‌ల‌కుండా మింగితే అది శ‌రీరంలో కొవ్వు కింద మారుతుంది. క‌నుక ఆహారాన్ని స‌రిగ్గా న‌మిలి మింగాలి. చాలా నెమ్మ‌దిగా భోజ‌నం చేయాలి. దీని వల్లి తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. కొవ్వు పేరుకుపోదు. ఉన్న కొవ్వు క‌రుగుతుంది.

Tags: ayurvedabelly fatover weightఅధిక బ‌రువుఆయుర్వేదంపొట్ట ద‌గ్గ‌రి కొవ్వు
Previous Post

సాధార‌ణ త‌ల‌నొప్పికి, మైగ్రేన్‌కు మ‌ధ్య తేడాలు ఏమిటో తెలుసా ? రెండింటినీ ఎలా గుర్తించాలంటే..?

Next Post

కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ వేసుకున్నాక 2 నెల‌ల‌కు త‌గ్గిపోతున్న యాంటీ బాడీలు.. ఐసీఎంఆర్ అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

Related Posts

చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025
చిట్కాలు

మ‌ద్యం ఎక్కువై హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య వ‌చ్చిందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025
చిట్కాలు

ఇంట్లో దోమ‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025
చిట్కాలు

క‌డుపులో మంట‌, క‌డుపు ఉబ్బ‌రంగా ఉందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..!

June 30, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ పాదాల పట్ల ఈ జాగ్ర‌త్త‌లను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

by Admin
July 6, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.