చిట్కాలు

డయాబెటిస్ ను తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు..!

భారత దేశంలో రోజురోజుకు డయాబెటిస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పలు అధ్యయనాల ప్రకారం భారతదేశంలో సుమారుగా 64.5 మిలియన్ల మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడే వారికి పలు ఆయుర్వేద చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి వారు షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..

follow these ayurvedic ways to reduce diabetes

1. మన శరీరంలో అధికంగా ఉండే చక్కెర స్థాయిలను అదుపులో చేయడానికి దాల్చినచెక్క నీరు ఎంతగానో దోహదపడుతుంది. దాల్చిన చెక్కలో మన శరీరంలో రక్తంలోని చక్కెరను సహజసిద్ధంగా ఉపయోగించుకునే రసాయనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే డయాబెటిస్ ను అదుపులో చేయడానికి దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది. ఒక లీటర్ నీటిలో మూడు టేబుల్ స్పూన్ల దాల్చినచెక్క పొడిని వేసి 20 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని తాగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది.

2. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి తేనె బాగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనెను కలిపి తాగితే అధిక బరువు తగ్గడమే కాక, డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది.

3. మన వంటింట్లో దొరికే సుగంధ ద్రవ్యాలలో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రతి రోజూ ఉదయం పరగడుపున పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

4. ఎన్నో ఔషధ గుణాలు దాగిఉన్న తాజా కరివేపాకులు 10 తీసుకుని రోజూ ఉదయాన్నే పరగడుపునే తినాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

5. గుప్పెడు జామ ఆకులు, మూడు గ్రాముల జీలకర్రను కలిపి మెత్తని మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి గ్లాసు నీరు సగం అయ్యే వరకు చిన్నమంటపై బాగా మరిగించాలి. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమాన్ని వడబోసి తాగటం వల్ల డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.

6. మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఎనిమిది గ్లాసుల నీటిని తాగి ఒక గంట వాకింగ్ చేయడం ద్వారా డయాబెటిస్ ను అదుపులో ఉంచవచ్చు.

ఇవే కాకుండా పొడపత్రి ఆకు చూర్ణం, బీట్‌రూట్‌, మెంతి ఆకులు, మెంతులు వంటి వాటిని రోజూ తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Sailaja N

Recent Posts