Cholesterol : మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎప్పటికీ తయారవుతూనే ఉంటుంది. ఇది రెండు రకాలు. ఒకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. ఇంకోటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. అయితే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అలా ఉంటేనే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో రక్త నాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు. ఫలితంగా రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అయితే శరీరంలో చాలా మందికి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. అలాంటి వారు కింద తెలిపిన వాటిని రోజూ తీసుకోవాలి. దీంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. మరి ఆ పదార్థాలు ఏమిటంటే..
1. ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
2. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు జీలకర్ర కూడా బాగానే పనిచేస్తుంది. జీలకర్ర కషాయాన్ని రోజూ ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. లేదా ఒక కప్పు పెరుగులో కొద్దిగా జీలకర్ర పొడిని కలిపి తినవచ్చు. దీంతో కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
3. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను అలాగే నమిలి తినాలి. దీంతో బీపీ తగ్గడమే కాదు.. చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది.
4. రోజూ ఉదయాన్నే ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగుతుండాలి. ఇది కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
5. రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసం సేవించాలి. దీని వల్ల జీర్ణ సమస్యలు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి.
6. రాత్రి పూట అతిమధురం చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తాగాలి. దీని వల్ల కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.