చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

డార్క్ సర్కిల్స్.. ప్రస్తుతం యువత అంతా ఎదుర్కొంటున్న సమస్య ఇది. వర్క్ స్ట్రెస్ వల్లో, లైఫ్ స్టైల్ వల్లో, హెవీ స్ట్రెస్ వల్లో, సరైన నిద్ర లేని కారణంగానో ఇవి ఏర్పడుతుంటాయి. ఇవి మన ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని త్వరగా తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

కలబంద గుజ్జును కళ్ల కింద రాసి 20 నిమిషాలు ఉంచాలి. అది ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడిగేసుకోవాలి. కలబంద గుజ్జు మన చర్మంలోని పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

follow these home remedies to get rid of dark circles

ఒక చెంచా నిమ్మరసం తీసుకుని అందులో బాదం నూనెను కలిసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ నూనెను కళ్ల చుట్టూ రాసుకుని ఒక 10 నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఇది నల్లటి వలయాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని గ్లోగా మారుస్తుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్‌ను కూడా పెంచుతుందని అంటున్నారు.

విటమిన్-ఈ క్యాప్సుల్‌ ఒకటి తీసుకుని అందులో మందును తీసుకోవాలి. అందులో కొబ్బరి నూనెను మిక్స్ చేసుకోవాలి. ఆ నూనెను కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఒక అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. విటమిన్-ఈ మందు చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో బాగా పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు.

Admin

Recent Posts