Sugar Levels : ప్రస్తుత తరుణంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అస్తవ్యవస్తమైన జీవన శైలి కారణంగానే ఇది వస్తోంది. అయితే షుగర్ వచ్చిన వారు డాక్టర్ ఇచ్చే మందుకు తోడు సరైన జీవనశైలిని పాటించాలి. అప్పుడే షుగర్ ను కంట్రోల్ చేయవచ్చు. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా షుగర్ తగ్గడం లేదని చెబుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన కొన్ని చిట్కాలను పాటించాలి. అప్పుడే షుగర్ బాగా తగ్గుతుంది. ఈ చిట్కాలను పాటిస్తే షుగర్ 500 ఉన్నా సరే 100కు వస్తుంది. ఇక షుగర్‌ను తగ్గించే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ ఉన్నవారు ఉదయం రెగ్యులర్‌గా చేసే టిఫిన్‌కు బదులుగా మొలకెత్తిన గింజలను తినాలి. అలాగే ఉదయం ఆహారంలో పండ్లు, కూరగాయలను తినాలి. కూరగాయలను నేరుగా తినలేకపోతే జ్యూస్ పట్టుకుని తాగాలి. ఇక మధ్యాహ్నం భోజనంలో అన్నం పూర్తిగా మానేయాలి. దానికి బదులుగా చిరు ధాన్యాలు లేదా జొన్నలు, రాగులతో చేసిన రొట్టె ఒకటి తినాలి. అలాగే మళ్లీ కూరగాయలను తినాలి. సాయంత్రం 6.30 గంటల వరకు రాత్రి భోజనం చేయాలి. భోజనం అంటే అందులో రొట్టెలు, అన్నం కాదు. నట్స్, విత్తనాలు, పండ్లను తినాలి.
ఇలా షుగర్ ఉన్నవారు ఆహారంలో మొత్తం మార్పులు చేయాలి. అలాగే ఉదయం నిద్రలేవగానే కనీసం 1 లీటర్ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతోపాటు రోజంతా వీలైనప్పుడల్లా గోరు వెచ్చని నీళ్లను తాగుతూనే ఉండాలి. దీంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. ఈ డైట్‌ను పాటిస్తే తప్పక ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.