కదలకుండా ఒకే ప్రదేశంలో ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, స్థూలకాయం, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు తదితర ఎన్నో కారణాలతో నేడు అనేక మంది పైల్స్ బారిన పడి ఇబ్బందులను అనుభవిస్తున్నారు. దీంతో మల విసర్జన చేసే సమయంలో తీవ్రమైన బాధ కలుగుతుంది. కొందరికి రక్త స్రావం కూడా అవుతుంది. అయితే కింద ఇచ్చిన పలు టిప్స్‌ను పాటిస్తే పైల్స్ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ఐస్ ముక్కలను తీసుకుని ఒక శుభ్రమైన గుడ్డలో చుట్టి సమస్య ఉన్న ప్రదేశంలో కొద్ది నిమిషాల పాటు ఉంచాలి. రోజుకు ఇలా కనీసం 3, 4 సార్లు చేస్తుంటే పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.
అలోవెరా జెల్‌ను తీసుకుని సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తున్నా పైల్స్ బాధ నుంచి విముక్తి పొందవచ్చు. ఇది నొప్పిని, వాపును, మంటను తగ్గిస్తుంది. ఒక నిమ్మకాయను తీసుకుని బాగా పిండి దాన్నుంచి రసం తీయాలి. అందులో కాటన్ బాల్స్ ముంచి సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. దీంతో పైల్స్ బాధ తగ్గుతుంది. వేడి పాలలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని 3 గంటలకు ఒకసారి తాగుతుంటే పైల్స్ తగ్గిపోతాయి. అర టీస్పూన్ మోతాదులో నిమ్మరసం, అల్లం రసం, పుదీనా రసం, తేనెలను తీసుకుని అన్నింటినీ కలిపి తాగాలి. దీంతో పైల్స్ తగ్గుముఖం పడతాయి.
బాదం నూనెలో కాటన్ బాల్స్ ముంచి అప్లై చేస్తున్నా పైల్స్ బాధ నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇలా రోజుకి కనీసం 5,6 సార్లు అయినా చేయాల్సి ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పైల్స్ బాధ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పైన చెప్పిన విధంగానే ఆలివ్ ఆయిల్‌తోనూ ప్రయత్నించవచ్చు. దీంతో పైల్స్ నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉండే ఆకుపచ్చని కూరగాయలను ఎక్కువగా తినాలి. సోయా బీన్స్, బీన్స్, చిక్కుడు జాతి పదార్థాలను ఎక్కువగా తినాలి. అదేవిధంగా మామిడి, నిమ్మ, బొప్పాయి వంటి పండ్లను కూడా తినవచ్చు. యాపిల్స్, టమాటాలు కూడా పైల్స్ నివారణకు ఎంతగానో తోడ్పడతాయి. అంజీర పండును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తింటుంటే పైల్స్ తగ్గుతాయి.
అరటి పండును రోజులో వీలైనన్ని సార్లు తింటున్నా పైల్స్ సమస్య తగ్గిపోతుంది. నీటిని రోజూ తగిన మోతాదులో తాగుతున్నా పైల్స్ బాధ ఉండదు. విరేచనం సులభంగా అవుతుంది. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని రోజు తాగగలిగితే పైల్స్ సమస్య నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకుని తాగుతుంటే పైల్స్ తగ్గిపోతాయి. రోజుకు రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తాగాల్సి ఉంటుంది.