చిట్కాలు

మాట్లాడేటప్పుడు నత్తి వస్తోందా.. అయితే ఈ చిన్న చిట్కాలతో నత్తి పరార్..!!

సాధారణంగా సమాజంలో కొంతమంది మాట్లాడేటప్పుడు తడబడుతూ నత్తితో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ సమస్యల నుంచి బయట పడాలంటే కొన్ని ఆయుర్వేద చిట్కాలు అనేవి ఫాలో కావాలి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. అయితే ఈ సమస్య ఉన్నవారు పదిమందిలో మాట్లాడాలంటే చాలా నామోషీగా ఫీల్ అవుతూ ఉంటారు.. ఇలాంటి వాటికి ఆయుర్వేదంతో కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పద్ధతి 1.. కావలసిన పదార్థాలు : వసకొమ్ము చిన్నముక్క, తేనె. చేయాల్సిన విధానం: గంధపు సాన పైన నీళ్లు చిలకరించి వసకొమ్ము చాది గంధాన్ని తియ్యాలి.. దానికి తేనె కలిపి నత్తి ఉన్న వాళ్లకు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు నాలుకపై పోయాలి. ఈ విధంగా కొంతకాలంపాటు చేస్తే ఎంత కఠినమైన పదాలనైనా సులభంగా పలకవచ్చు.

follow these wonderful health tips to reduce stutter while speaking

పద్ధతి 2.. కావలసిన పదార్థాలు: పసుపు కొమ్ము కాల్చిన పొడి, పొంగించిన పటిక పొడి. పసుపు పొడిని పటిక పొడిలో అద్దుకొని చప్పరించాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేసిన తర్వాత అంతా సెట్ అవుతుంది.

పద్ధతి 3 : కావలసినవి.. సరస్వతి సమూల చూర్ణం 50 గ్రాములు తీసుకుని నానబెట్టి తర్వాత ఎండబెట్టి వాస చూర్ణం 50 గ్రాములు.. అలాగే నేతిలో వేయించిన శొంఠి చూర్ణం 50 గ్రాములు.. దోరగా వేయించిన పిప్పళ్ళ చూర్ణం 50 గ్రాములు. పటిక బెల్లం 50 గ్రాములు తీసుకోవాలి.. వీటన్నిటిని విడివిడిగా వస్త్రఘాలితం చేసి, కలిపి నిల్వ చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం పర‌గడుపున తీసుకొని చిన్న పిల్లలకు చిటికెడు, పెద్ద వారు తీసుకుని తేనెతో కలిపి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల 10 రోజులలో చాలా మార్పు కనబడుతుంది.

Admin

Recent Posts