కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం వణికిపోయింది. అయితే ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యం మీద శ్రద్ద పెడుతున్నారు. ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే అందుకు పలు ఇంటి చిట్కాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
రోజు వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్దాలన్నీబయటికి పోతాయి. మంచి నీళ్ళు మాత్రమే కాక మనం తీసుకునే ఆహారం వేడిగా ఉండేలా చూసుకోవాలి. చల్లటి ఆహార పదార్థాలు దూరం పెట్టాలి. రోజు 30 నిమిషాల పాటు మెడిటేషన్ లేదా యోగా చేయాలి. వంటల్లో పసుపు, జీలకర్ర , ధనియాలు, వెల్లుల్లి ఉపయోగించాలి . తులసి, దాల్చిన చెక్క, మిరియాలు,ఎండు ద్రాక్ష వాడాలి.
‘టీ’ని రోజుకి రెండు సార్లు తాగాలి. బెల్లం, నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు పసుపు పాలు తాగడం కూడా మంచిది. గొంతు నొప్పికి పుదీనా ఆకులు, వాము వాసన చూడాలి. లవంగాలు పొడి చేసుకుని చక్కర, తేనె లో కలిపి రోజు రెండు, మూడు సార్లు తినాలి. జలుబు గా ఉన్నప్పుడు ముక్కు రంధ్రాల్లో నువ్వుల నూనె, కొబ్బరి నూనె వేయాలి. ఒక చెంచా నువ్వుల నూనె తో ఆయిల్ పుల్లింగ్ థెరపీ రోజు ఒకటి లేదా రెండు సార్లు చేయాలి.