Belly Fat : అధిక బరువు.. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. బరువు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు బరువు పెరగడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అధిక బరువు వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా మనం ఎంతో ఇష్టపడి కొనుకున్న బట్టలు వేసుకోలేకపోతుంటాం. అయితే కొందరిలో మాత్రం పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి దానిని కుండలా కనబడేలా చేయడం మనల్ని మరింత బాధిస్తుంది.
బాన పొట్ట వల్ల మనం అనాకారిగా కనబడడమే కాకుండా మన సన్నిహితుల దగ్గరి నుండి పదే పదే వచ్చే లావు తగ్గే సలహాలు మనల్ని మరింత బాధకు గురి చేస్తాయి. పూర్వకాలంలో పొట్ట పెరగడం అనేది వయసైపోయింది అనడానికి గుర్తుగా ఉండేది. వ్యాయాలు చేయడం వల్ల మనం పొట్టను తగ్గించుకోవచ్చు. కానీ వ్యాయామం చేయడం ఆపేయగానే మరలా పొట్ట పెరుగుతుంది. పొట్ట పెరిగిపోయి ఊబకాయంతో బాధపడే వారు ఇంట్లో ఉండి కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కొద్ది రోజుల వ్యవధిలోనే కచ్చితమైన మార్పును చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పురుషులైనా, స్త్రీలైనా పొట్ట తగ్గాలంటే రోజుకు 15 నుండి 20 నిమిషాల పాటు తిరగలి లేదా సన్నికలు ఉపయోగించమని నిపుణులు చెబుతున్నారు. మసాలాలు నూరె పరికరమే సన్నికలు. దీనిని ఉపయోగించడం వల్ల పొట్ట భాగంలో ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. కనుక పొట్ట భాగంలో కండరాల సంకోచ, వ్యాకోచాలు చక్కగా జరుగుతాయి. దీంతో సన్నికలను ఉపయోగించడం వల్ల పొట్ట దానంతట అదే తగ్గుతుంది. ముఖ్యంగా స్త్రీలు పొత్తి కడుపు వద్ద కొవ్వు కరగాలంటే రోజుకు పది నిమిషాలైనా తిరగలిని ఉపయోగించాలని వారు చెబుతున్నారు. స్త్రీలు తిరగలిని ఉపయోగించడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు త్వరగా కరుగుతుందట.
అలాగే ఊబకాయంతో బాధపడే వారు భోజనం చేసిన తరువాత కనీపం పది నిమిషాల పాటు అటూ ఇటూ నడవాలి. అదే విధంగా రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగాలి. నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడే వారు క్యాలరీలు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. కేక్స్, కుకీస్, చిప్స్, ఐస్ క్రీమ్స్ వంటివి తినడం మానేయాలి. తీపిగా పదార్థాలను తినడం మానేస్తేనే కొవ్వు సమస్య నుండి మనం బయటపడవచ్చు. ఫాస్ట్ ఫుడ్ కు బదులు పీచు పదార్థాలను తీసుకోవాలి. పండ్లు, గింజలు, ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తూ చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు.