చిట్కాలు

జలుబుకు అద్భుతంగా పనిచేసే ఔషధ పదార్థం.. అల్లం.. ఎలా తీసుకోవాలంటే..?

సాధారణంగా సీజన్లు మారేకొద్దీ దగ్గు, జలుబు, జ్వరం సమస్యలు ఎవరికైనా సరే వస్తుంటాయి. వర్షాకాలం, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. అలాగే ఇన్‌ఫెక్షన్ల కారణంగా కూడా ఈ సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలకు వంట ఇంట్లో ఉండే ఒకే ఒక్క పదార్థం ఔషధంగా పనిచేస్తుంది. అదే.. అల్లం..

ginger can be very beneficial for treating cold here how to use it

అల్లంలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అల్లంలో ఉండే ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఈ క్రమంలో అల్లంను ఉపయోగించడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం నుంచి బయట పడవచ్చు.

ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అల్లం వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే కప్పు మోతాదులో తాగాలి. ఇలా రోజుకు మూడు పూటలా తాగుతుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.

చిన్న అల్లం ముక్కను నోట్లో ఉంచుకుని నములుతూ రసాన్ని మింగాలి. దీంతో గొంతు సమస్యల నుంచి బయట పడవచ్చు.

ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని తులసి ఆకులు, కొద్దిగా అల్లం వేసి మరిగించి తాగాలి. దీని వల్ల కూడా జలుబు తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

రోజూ తీసుకునే ఆహారంలో అల్లంను ఉపయోగించడం వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌గా వచ్చే అనారోగ్య సమస్యలకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts