చిట్కాలు

అల్లంతో అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ దాదాపుగా అల్లం ఉంటుంది. ఇది వంటి ఇంటి ప‌దార్ధం. దీన్ని నిత్యం వంట‌ల్లో వేస్తుంటారు. అల్లంతో కొంద‌రు నేరుగా చ‌ట్నీ చేసుకుంటారు. వేడి వేడి ఇడ్లీల‌ను అల్లం చ‌ట్నీతో తింటే భ‌లే రుచిగా ఉంటాయి. అయితే ఆయుర్వేద ప‌రంగా అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ముఖ్యంగా అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు.

ginger for weight loss know how to use it

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల వాపులు త‌గ్గుతాయి. దీంతోపాటు అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. అల్లం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఆక‌లి పెరుగుతుంది. ఆక‌లి అస్స‌లు లేని వారు అల్లం ర‌సంను సేవిస్తుండాలి. అల్లంను రోజూ తీసుకుంటే జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంద‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లే చెబుతున్నాయి.

అల్లం బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించ‌గ‌ల‌దు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగిస్తుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో స్థూల‌కాయం త‌గ్గుతుంది.

1. అల్లంను నిమ్మ‌ర‌సంతో తీసుకోవ‌డం వ‌ల్ల వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఒక పాత్ర‌లో గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసి బాగా మ‌రిగించాలి. అనంత‌రం ఆ నీటిని వ‌డ‌క‌ట్టి అందులో ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లిపి తాగేయాలి. ఇలా రోజూ ఒక‌సారి తాగాలి. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసిన త‌రువాత ఇలా తాగితే మంచిది.

2. నిమ్మ‌ర‌సం లాగే అధిక బ‌రువును త‌గ్గించేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ కూడా ప‌నిచేస్తుంది. పైన తెలిపిన పానీయంలో నిమ్మ‌ర‌సం కాకుండా అర టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ క‌లిపి కూడా తాగ‌వ‌చ్చు. దీంతోనూ వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. శ‌రీర మెట‌బాలిజం పెరిగి క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. దీంతో కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

3. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్‌ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ అల్లం రసం, ఒక టీస్పూన్ తేనె క‌లిపి తాగాలి. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గ‌డ‌మే కాదు, అధిక బ‌రువు త‌గ్గుతారు.

Admin

Recent Posts