Grape Juice For Liver : ప్రస్తుత కాలంలో చాలా మందికి మద్యం సేవించే అలవాటు ఉంది. కొందరైతే దీనికి బానిసగా తయారవుతున్నారు. మద్యపాన సేవనం వల్ల కాలేయం దెబ్బతింటుందని ఆరోగ్యం పాడవుతుందని ఎవరు ఎన్ని సార్లు చెప్పినా ఎవరి మాట వినరు. మద్యం సేవించి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలా ఆల్కాహాల్ కు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వారికి 500 ఎమ్ ఎల్ వరకు ద్రాక్ష రసం ఇవ్వడం వల్ల ఆల్కాహాల్ తాగడం వల్ల కలిగే నష్టాన్ని దాదాపు నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనకు మార్కెట్ లో వివిధ రకాల ద్రాక్ష పండ్లు లభిస్తున్నాయి. ఏ రకం ద్రాక్ష పండ్లతో చేసిన జ్యూస్ ను తీసుకున్నా కూడా చక్కటి ఫలితాలను పొందవచ్చు.
ద్రాక్ష పండ్ల రసంలో నిరింజిన్, నిరింజినిన్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అర లీటర్ ద్రాక్ష పండ్ల రసంలో 300 నుండి 370 మిల్లీ గ్రాముల వరకు ఉంటాయి. ఈ రసాయనాల సమ్మేళనాలు కాలేయ కణాల్లో ఇన్ ప్లామేషన్ రాకుండా చేయడంలో సహాయపడతాయి. ఇన్ ప్లామేషన్ రాకుండా ఉండడం వల్ల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో కాలేయ కణాల నుండి సైటో ప్లాసం అనే ద్రవం బయటకు వస్తుంది. సైటో ప్లాసం బయటకు రావడం వల్ల కాలేయ కణాలు నెమ్మదిగా దెబ్బతింటాయి. దీంతో కణాలు గట్టిగా తయారయ్యి కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. కణాల గోడలు దెబ్బతిని సైటో ప్లాసం బయటకు రాకుండా చేయడంలో కాలేయ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా మనకు ద్రాక్ష పండ్ల రసంలో ఉండే ఈ రెండు రసాయన సమ్మేళనాలు సహాయపడుతుంది.
అలాగే ద్రాక్ష రసంలో ఉండే నిరింజిన్, నిరింజినిన్ అనే రెండు రసాయన సమ్మేళనాల కారణంగా ఎ డి హెచ్ అనే ఎంజైమ్ ఎక్కువగా తయారవుతుంది. ఈ ఎంజైమ్ ఆల్కాహాల్ ను చాలా త్వరగా విడగొడుతుంది. ఇలా విడగొట్టడం వల్ల శరీరానికి ఆల్కాహాల్ వల్ల కలిగే నష్టం తగ్గుతుంది. ద్రాక్ష పండ్ల రసం తాగడం వల్ల ముఖ్యంగా ఈ మూడు రకాల ప్రయోజనాలు ఆల్కహాల్ తాగే వారికి కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కాహాల్ తీసుకోకుండా చాలా మంది ఉండలేరు. అలాంటి వారు ఆల్కాహాల్ తో పాటు ద్రాక్ష పండ్ల రసం కూడా తాగడం వల్ల కాలేయం దెబ్బతినకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష పండ్ల రసం తీసుకోవడం వల్ల ఆల్కాహాల్ ను తీసుకున్నప్పటికి శరీరానికి ఎక్కువగా నష్టం కలగకుండా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.