Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Gurivinda Ginja : ఈ గింజ‌లు అంద‌రికీ తెలిసిన‌వే.. వీటిని ఇలా ఉప‌యోగిస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది..!

D by D
May 31, 2023
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Gurivinda Ginja : జుట్టు రాల‌డం, దుర‌ద‌, చుండ్రు, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికి ఈ స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. జుట్టును ఒత్తుగా, న‌ల్ల‌గా ఉంచుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. ఈవిధంగా జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎటువంటి ఖ‌ర్చు లేకుండా చాలా సుల‌భంగా జుట్టును ఆరోగ్యవంతంగా మార్చుకోవ‌చ్చు. ఒక చ‌క్క‌టి చిట్కాను వాడ‌డం వల్ల చాలా సుల‌భంగా జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. జుట్టును అందంగా, న‌ల్ల‌గా, ఆరోగ్యంగా మార్చే ఈ చిట్కా ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం గురివింద గింజ‌ల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ఇవి మ‌న‌కు పొలాల ద‌గ్గ‌ర‌, చేల కంచెల వెంబ‌డి విరివిరిగా ల‌భిస్తూ ఉంటారు. అలాగే ఆయుర్వేద షాపుల్లో కూడా ఈ గురివింద గింజ‌లు మ‌న‌కు ల‌భిస్తాయి. గురివింద గింజ‌లు చూడ‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటాయి. అలాగే వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఈ గింజ‌ల‌ను ఉప‌యోగించడం వ‌ల్ల మ‌నం జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. దీని కోసం ముందుగా గురివింద గింజ‌ల‌ను జార్ లో వేసి ప‌ప్పు లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ ప‌ప్పును మందంగా ఉండే వ‌స్త్రంలో వేసి మూట క‌ట్టాలి. త‌రువాత ఒక గిన్నెలో అర గ్లాస్ పాల‌ను తీసుకోవాలి. ఇందులో గురివింద గింజ‌ల మూట వేసి పాలు పూర్తిగా ఆవిరై పోయే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత మూట‌ను తీసి ప‌క్కకు ఉంచాలి. ఇప్పుడు మ‌రో గిన్నెలో100 ఎమ్ ఎల్ కొబ్బ‌రి నూనెను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ గుంట‌గ‌ల‌గ‌రాకు పొడిని వేసి క‌ల‌పాలి.

Gurivinda Ginja for hair use them in this way for better effect
Gurivinda Ginja

త‌రువాత ఉడికించిన గురివింద గింజ‌ల ప‌ప్పు కూడా వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ నూనెను చిన్న మంట‌పై వేడి చేయాలి. నూనె మ‌రిగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఈ నూనెను వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను రాత్రి ప‌డుకునే ముందు జుట్టు కుదుళ్ల‌ల్లోకి ఇంకేలా బాగా ప‌ట్టించాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచుకుని ఉద‌యయాన్నే త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది. దుర‌ద‌, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Tags: Gurivinda Ginjahair problems
Previous Post

Vankaya Vellulli Fry : వంకాయ వెల్లుల్లి ఫ్రై.. త‌యారీ ఇలా.. అన్నంలో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..!

Next Post

Green Mango Rasam : పచ్చి మామిడికాయలతో రసం తయారీ ఇలా.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Related Posts

sports

మ్యాచ్ ఆడే టైంలో క్రికెటర్లు వాడే వైట్ పౌడర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?

June 1, 2025
వినోదం

క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

June 1, 2025
హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!