Hair Growth Remedy : జుట్టు రాలడం అనే సమస్యను ప్రస్తుత కాలంలో మనలో దాదాపు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. కారణాలేవైనప్పటికి జుట్టు రాలడం సమస్య మనకు మరింత మానసిక ఆందోళనను కలిగిస్తుంది. ఇంటి చిట్కాను ఉపయోగించి మనం ఈ జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ చిన్నదే అయినప్పటికి ప్రభావవంతంగా పని చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించే ఇంటి చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. ఈన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలడం సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల 15 రోజుల్లోనే మనం తేడాను గమనించవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం అల్లం రసాన్ని, కలబంద గుజ్జును, కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.
మన వంటింట్లో ఉండే అల్లం మన జుట్టు పెరుగుదలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరినూనె జుట్టు పొడిబారడాన్ని తగ్గించి జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో జుట్టు పొడవును బట్టి 5 నుండి 10 టీ స్పూన్ల అల్లం రసాన్ని తీసుకోవాలి. తరువాత అందులో 3 టీ స్పూన్ల కలబంద గుజ్జును, 3 టీ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. తరువాత ఈ మిశ్రమం జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా సున్నితంగా మర్దనా చేయాలి. ఈ ఫ్యాక్ ను వేసుకున్న 2 గంటల తరువాత మనం తరచూ ఉపయోగించే షాంపును వాడి తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.
అంతేకాకుండా జుట్టు పొడిబారడం తగ్గి కాంతివంతంగా తయారవుతుంది. బయట మార్కెట్ లో దొరిరే షాంపులను, నూనెలను వాడినప్పటికి ఎటువంటి ఫలితం లేక ఇబ్బందిపడుతున్న వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ చిట్కా తయారీలో మనం వాడినవన్ని కూడా సహజసిద్ద పదార్థాలే. కనుక వీటిని వాడడం వల్ల జట్టుకు ఎటువంటి హాని కలగదు. జుట్టు రాలడం సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల కేవలం 15 రోజుల్లోనే చక్కటి ఆందమైన, ఆరోగ్యవంతమైన, ప్రకాశవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.