Health Tips : మన శరీరంలో జీర్ణ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తుంది. అందువల్ల మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అయితే ప్రస్తుతం చాలా మంది అవలంబిస్తున్న అస్తవ్యస్తమైన జీవన విధానాలు, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం దెబ్బ తింటోంది.
జీర్ణవ్యవస్థలో జీర్ణాశయం, చిన్నపేగులు, పెద్దపేగు వంటివి ఉంటాయి. ఇవన్నీ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అనేక అనారోగ్య సమస్యలకు జీర్ణవ్యవస్థ అనారోగ్యంగా ఉండడమే కారణమవుతుంటుంది. కనుక జీర్ణవ్యవస్థను మనం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
మన వంట ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే జీర్ణవ్యవస్థను శుభ్రం చేసుకోవచ్చు. వాటిల్లో మిరియాలు ఒకటి. రాత్రి గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే చాలు.. జీర్ణాశయం, పేగులు అన్నీ శుభ్రమవుతాయి. లేదా మిరియాలతో రసం చేసుకుని రాత్రి భోజనంలో తీసుకోవచ్చు.
ఇక జీర్ణాశయం, పేగులను శుభ్రం చేసే ఇంకో పదార్థం.. జీలకర్ర. జీలకర్ర చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. రోజూ జీలకర్ర కషాయం తాగుతుంటే జీర్ణాశయం, పేగులు అన్నీ చీపురుతో తుడిచినట్లు శుభ్రమైపోతాయి. అధిక బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది. డయాబెటిస్ తగ్గుతుంది.
ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి 10 నిమిషాల పాటు సన్నని మంటలపై మరిగించాలి. తరువాత వచ్చే కషాయాన్ని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే పరగడుపునే తాగేయాలి. లేదా భోజనంలో పెరుగులో కొద్దిగా జీలకర్ర పొడిని కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో పేగులు, జీర్ణాశయం అన్నీ శుభ్రమవుతాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
ఈ విధంగా రెండు చిట్కాలను పాటించడం వల్ల జీర్ణాశయం, పేగులు శుభ్రం కావడంతోపాటు గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను తరచూ పాటిస్తుంటే ఎంతో మేలు జరుగుతుంది.