Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Heat In Body : శ‌రీరంలోని వేడి వెంట‌నే త‌గ్గాలంటే.. ఇలా చేయండి..!

D by D
March 1, 2023
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Heat In Body : అధిక వేడి.. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఎండాకాలంలో వ‌స్తుంది. కానీ కొంద‌రిలో కాలంతో సంబంధం లేకుండా ఈ స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంది. అధిక వేడి స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వేడి క‌లిగించే ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం, నీటిని తాగ‌క‌పోవ‌డం, అధికంగా ప‌ని చేయ‌డం, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, మాంసాహారాన్ని ఎక్క‌వుగా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అధిక వేడి వల్ల త‌ల‌తిరిగిన‌ట్టుగా ఉండ‌డం, కంటి చూపు స‌రిగ్గా క‌న‌బ‌డ‌క‌పోవ‌డం, త‌ల‌నొప్పి, మూత‌విస‌ర్జ‌న స‌మ‌యంలో ఇబ్బందులు త‌లెత్త‌డం వంటి స‌మ‌స్య‌లు ఎదురవుతాయి. అధిక వేడి కార‌ణంగా శ‌రీరంలో అవ‌య‌వాలు దెబ్బ‌తినే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక మ‌న శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌ల‌ను ఎల్ల‌ప్పుడూ సాధార‌ణ స్థాయిలో ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.

మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో కొన్ని ర‌కాల చిట్కాల‌ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకోవ‌చ్చు. అధిక వేడిని త‌గ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక వేడి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌, కండ చ‌క్కెర క‌లిపి రెండు గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఈ నీటిని తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి త‌గ్గి శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. నాన‌బెట్టేంత స‌మ‌యం లేని వారు ఈ రెండింటిని స‌మానంగా తీసుకుని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీళ్ల‌ల్లో క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా శ‌రీరంలో వేడి త‌గ్గుతుంది.

Heat In Body best home remedy to reduce it
Heat In Body

అదే విధంగా మూడు నుండి నాలుగు టీ స్పూన్ల స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో వేసి నాన‌బెట్టాలి. ఇలా నాన‌బెట్టిన స‌బ్జా గింజ‌ల‌ను ఒక గ్లాస్ నీటిలో వేసి క‌ల‌పాలి. ఇందులోనే అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వేడి త‌గ్గి చ‌లువ చేస్తుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో తేనెను క‌లిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే ఈ నీటిని ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా చేయ‌డం వల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. వీటితో పాటు శ‌రీరానికి త‌గిన‌న్ని నీటిని తాగాలి. ఫ్రిజ్ లో నీటిని తాగ‌డానికి బ‌దులుగా సాధార‌ణ నీటిని తాగ‌డానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాలి. అలాగే కొబ్బ‌రి నీటిని కూడా ఎక్కువ‌గా తాగాలి. అలాగే మ‌సాలా దినుసుల‌ను, మాంసాహారాన్ని త‌క్కువ‌గా తీసుకోవాలి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా శ‌రీరంలో వేడిని త‌గ్గించుకోవ‌చ్చు.

Tags: heat in body
Previous Post

Aloo Carrot Fry : ఆలు, క్యారెట్‌ల‌ను క‌లిపి ఇలా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Next Post

Egg Bites : సాయంత్రం స‌మ‌యంలో కోడిగుడ్ల‌తో ఇలా స్నాక్స్ చేసుకుని తినండి.. సూప‌ర్‌గా ఉంటాయి..!

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!