ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో హైబీపీ ఒకటి. బీపీ నిరంతరం ఎక్కువగా ఉండడం వల్ల హైబీపీ వస్తుంది. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. వంశపారంపర్యంగా కొందరికి బీపీ వస్తుంది. అలాగే పొగ తాగడం, మద్యం సేవించడం, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, అధికంగా ఉప్పు తీసుకోవడం, ఒత్తిడి, వయస్సు మీద పడడం, కిడ్నీ సమస్యలు, నిద్రలేమి వంటి అనేక కారణాల వల్ల బీపీ వస్తుంటుంది.
120/80 రీడింగ్ ఉండే దాన్ని నార్మల్ బీపీ అంటారు. ఇంతకు మించి ఎక్కువగా రీడింగ్ నమోదు అయితే దాన్ని హైబీపీ అంటారు. రక్తనాళాల గోడలు గట్టి పడడం వల్ల రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో గుండె ఎక్కువ పీడనంతో రక్తాన్ని పంప్ చేస్తుంది. ఈ క్రమంలో హైబీపీ వస్తుంది. అయితే అత్తపత్తి మొక్క ఆకు వల్ల బీపీ సమస్య నుంచి బయట పడవచ్చు.
అత్తపత్తి మొక్క ఆకులను సేకరించి శుభ్రం చేసి వాటి నుంచి రసం తీయాలి. దాన్ని ఉదయం, సాయంత్రం 15 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. అత్తపత్తి మొక్క ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు బీపీని తగ్గిస్తాయి.
ఇక బీపీ ఉన్నవారు మధ్యాహ్నం, రాత్రి భోజనంలో పెరుగు లేదా మజ్జిగ తింటే ఉప్పు వేసుకోరాదు. అలాగే సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడాలి. ఉదయం, సాయంత్రం రెండు పూటలా మొలకెత్తిన గింజలు, బొప్పాయి, అరటి పండ్లను తింటుండాలి. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ రెండు పూటలా తినాలి. దీంతో బీపీ తక్కువ సమయంలోనే నియంత్రణలోకి వస్తుంది.