మద్యం విపరీతంగా సేవించడం వల్ల హ్యాంగోవర్ సమస్య వస్తుంటుంది. దీంతో తలనొప్పి తీవ్రంగా వస్తుంది. అలాగే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం అనిపిస్తాయి. కొందరికి వాంతులు కూడా అవుతాయి. తీవ్రమైన దాహం వేస్తుంది. అలసటగా ఉంటుంది. కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే హ్యాంగోవర్ సమస్య నుంచి బయట పడవచ్చు.
* మద్యం సేవించడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో హ్యాంగోవర్ వస్తుంది. కనుక నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. దీని వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. హ్యాంగోవర్ రాదు.
* హ్యాంగోవర్ వచ్చిన వారి శరీరంలో మినరల్స్ శాతం తగ్గిపోతుంది. సోడియం, పొటాషియం, కాల్షియం తగ్గుతాయి. కనుక ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగాలి. లేదా నిమ్మజాతికి చెందిన పండ్ల రసాలను తాగాలి. దీంతో మినరల్స్ లభిస్తాయి. హ్యాంగోవర్ నుంచి బయట పడవచ్చు.
* మద్యం సేవించిన తరువాత హ్యాంగోవర్ రాకుండా ఉండాలంటే పోషక పదార్థాలను అందించే ఆహారాలను తినాలి. నట్స్, కొబ్బరినీళ్లు, అరటి పండ్లు, వెన్న, తాజా పండ్లను తినవచ్చు. దీంతో లివర్ ఆల్కహాల్‌ను సులభంగా బయటకు పంపుతుంది. డీహైడ్రేషన్, హ్యాంగోవర్ రావు.
* హ్యాంగోవర్ సమస్య ఉన్నవారు కొద్దిగా అల్లం రసం సేవించాలి. దీంతో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
* విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, ఇతర ఆహారాలను తీసుకున్నా హ్యాంగోవర్ నుంచి బయట పడవచ్చు.
* మజ్జిగను బాగా పలుచగా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగుతుండాలి. దీంతో హ్యాంగోవర్ తగ్గుతుంది.