చిట్కాలు

అనేక అనారోగ్య సమస్యలకు ఔషధం దాల్చిన చెక్క.. ఎలా ఉపయోగించాలంటే..?

దాల్చిన చెక్క దాదాపుగా ప్రతి ఇంట్లోనూ వంటి ఇంటి సామగ్రిలో ఉంటుంది. దీన్ని వంటల్లో వేస్తుంటారు. దాల్చిన చెక్క పొడిని వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్కలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. అందువల్ల దాల్చిన చెక్కను ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి అందుకు దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

home remedies using cinnamon

1. ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల నీరు, ఒక టీస్పూన్‌ తేనె కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట రాయాలి. దీంతో ఆర్థరైటిస్‌ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. ఒక కప్పు నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీంతో విరేచనాలు తగ్గుతాయి.

3. కొద్దిగా దాల్చిన చెక్క పొడి, నిమ్మరసంలను తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని మొటిమలు, మచ్చలు, బ్లాక్‌ హెడ్స్ పై రాయాలి. కొంత సేపటి తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల ఆయా సమస్యలు తగ్గుతాయి.

4. ఆలివ్‌ నూనెను 100 ఎంఎల్‌ మోతాదులో తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. అందులో ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని సీసాలో నిల్వ చేసుకోవాలి. కొంత సేపటి తరువాత దాల్చిన చెక్క పొడి నూనెలో బాగా కలుస్తుంది. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని తలకు బాగా రాయాలి. 15-30 నిమిషాల పాటు అలాగే ఉండి కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

5. ఒక కప్పు నీటిని మరిగించి అందులో 1 టీస్పూన్‌ తేనె, అర టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఆ మిశ్రమం ఉన్న పాత్రపై మూత పెట్టి దాన్ని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత అందులో మరికొంత తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని నిద్రించే ముందు సగం తాగాలి. మిగిలిన సగాన్ని మరుసటి రోజు ఉదయం పరగడుపునే తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే అధిక బరువు తగ్గుతారు.

6. ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలిపి ఆ మిశ్రమంతో నోటిని పుక్కిలించాలి. ఇలా చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది.

7. ఒక టీస్పూన్‌ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. కొంతసేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

8. ఒక కప్పు నీటిని తీసుకుని మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో పావు టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి, పావు టీస్పూన్‌ లవంగాల పొడి, అర టీస్పూన్‌ అల్లం రసం వేసి కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా చేస్తుంటే దగ్గు తగ్గుతుంది.

9. ఒక టీస్పూన్‌ నీరు, ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని కలిపి మిశ్రమంగా చేసి దాన్ని నుదుటిపై రాయాలి. తలనొప్పి తగ్గుతుంది.

10. ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి. అనంతరం అందులో అర టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని వేయాలి. తరువాత 5 నిమిషాలు ఉంచాలి. అనంతరం ఆ మిశ్రమంలో తేనె కలపాలి. దాన్ని రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది.

11. ఒక కప్పు నీటిని మరిగించి అందులో అరటీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి, అర టీస్పూన్‌ మిరియాల పొడి, తేనె వేసి బాగా కలిపి తాగాలి. గొంతు నొప్పి, ఇతర గొంతు సమస్యలు తగ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts