పచ్చిబఠానీలను సాధారణంగా చాలా మంది కూరల్లో వేస్తుంటారు. వీటిని బిర్యానీ వంటకాల్లోనూ వేస్తారు. వీటిని నేరుగా తినేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ ఉడకబెట్టి లేదా రోస్ట్ చేసి తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే పచ్చిబఠానీల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మనకు పోషణను, ఆరోగ్యాన్ని అందిస్తాయి. పచ్చి బఠానీలను ఉపయోగించి పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చిబఠానీలను మిక్సీ పట్టి పేస్ట్‌లా చేసి దాంతో కషాయం కాయాలి. ఆ కషాయంతో ముఖాన్ని రోజూ శుభ్రం చేసుకోవాలి. దీంతో పిల్లల్లో ఏర్పడే చికెన్ పాక్స్ మచ్చలు తగ్గుతాయి. అలాగే మొటిమలను కూడా తగ్గించుకోవచ్చు.
2. పచ్చిబఠానీలను రోజూ ఉడకబెట్టి ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. లేదా వీటితో సూప్ తయారు చేసుకుని కూడా తాగవచ్చు. దీని వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
3. పచ్చి బఠానీలను రోజూ తింటుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
4. పచ్చి బఠానీలను 24 గంటల పాటు నీటిలో నానబెట్టి తరువాత వాటిని ఉడికించి రోజూ కప్పు మోతాదులో తీసుకోవాలి. దీంతో శరీరానికి బలం వస్తుంది. దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు.
5. పచ్చి బఠానీల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల మాంసాహారం తినలేని వారికి ఇవి అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365