నిత్యం మనం వాడే వంటి ఇంటి పదార్థాల్లో పసుపు ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేస్తుంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల పసుపు అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే పసుపుతో ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చిటికెడు పసుపు, కొబ్బరినూనెలను కలిపి ఆ మిశ్రమంతో దంతాలను తోముకోవాలి. వారంలో కనీసం రెండు, మూడు సార్లు ఇలా చేయడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు తెల్లగా మారుతాయి. నోట్లో బాక్టీరియా నశిస్తుంది. చిగుళ్ల నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది.
2. రోజూ తినే ఆహార పదార్థాల్లో మూడు సార్లు పసుపును అర టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీంతో డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
3. అర కప్పు పెరుగులో అర టీస్పూన్ పసుపును కలిపి తీసుకుంటే డయేరియా తగ్గుతుంది.
4. రోజూ రాత్రి నిద్రించేముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ పసుపును కలిపి తాగాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆస్తమా, ఇతర శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి.
5. ఒక టీస్పూన్ పసుపు, అంతే మోతాదులో తేనెను కలిపి ముఖంపై రాస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365