Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

ఏయే వ్యాధులు త‌గ్గాలంటే.. క‌ర‌క్కాయను ఎలా తీసుకోవాల్సి ఉంటుందంటే..?

Admin by Admin
June 18, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

క‌ర‌క్కాయ‌.. దీని శాస్త్రీయ నామము terminalia chebula. సంస్కృతం లో హరిటకి అంటారు. కరక్కాయ వాత తత్వముపై పనిచేస్తుంది. బుద్ధిని వికసింపజేస్తుంది. బలం కలిగిస్తుంది, ఆయుఃకాలం పెంచుతుంది. ఉప్పు తప్ప అన్ని రుచులు కలిగి ఉంటుంది. కరక్కాయ విరేచ‌నకారి, లుబ్రికేంట్, మలబద్దకాన్ని నివారిస్తుంది. పైల్స్ కి మంచి మందు. ఏస్త్రిన్జేంట్(Astringent) , యాంటి స్పాస్మడిక్(Anti-Spasmodic),యాంటి పైరేటిక్(Anti-pyretic) గా పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరము , ఎక్కిళ్ళు, వాంతులు తగ్గిస్తుంది, జీర్ణ క్రియకు తోడ్పడుతుంది, ఆదుర్దా, నాడీమండల నిస్త్రాణను నియంత్రిన్స్తుంది. కంటికి మంచి మందు, కంఠ‌స్వరము చక్కబెడుతుంది, కఫ‌ జ్వరాలు నయమవుతాయి.

కరక్కాయ పొడిని మోతాదుకు 3 గ్రా . లు తీసుకొని తేనెతో నిత్యము రెండు పూటల ( ఉదయం , సాయంత్రము ) తీసుకుంటూ , పథ్యము చేస్తు , వుంటే 10 రోజుల్లో పచ్చకామెర్లు ( jaundice) తగ్గిపోతాయి. కరక్కాయ పొడి (ఒక) 1 భాగములో , వేయించిన పిప్పళ్ళ పొడిని ½ (అర) భాగము కలిపి. దాంట్లో నుండి ఒక మోతాదుకు 1 గ్రా పొడిని ని తీసుకొని తేనెతో కలిపి ప్రతి 4 గంటలకి ఒకసారి తీసుకుంటే కోరింత దగ్గు( whooping cough) తగ్గిపోతుంది . భోజనానికి ఒక గంట ముందు కరక్కాయ పొడిని కొంచెం బెల్లముతో కలిపి తీసుకుంటే రక్త మొలలు (piles) తగ్గిపోతాయి . కరక్కాయ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే విష జ్వరములు తగ్గుతాయి . కరక్కాయ పొడిని ఆముదములో కలిపి ప్రతి రోజు తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి . క‌రక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు వీటి చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసుకొని పూటకు అర టీస్పూన్ చొప్పున మూడుపూటలా తేనెతో గాని లేదా నీళ్ళతో గాని కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది.

how to use karakkaya for different types of diseases

ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున అరకప్పు వేడినీళ్లతో గాని లేదా తేనె, నెయ్యి మిశ్రమంతోగాని కలిపి తీసుకోవాలి. ఆయాసం, ఎక్కిళ్లు సతమతం చేస్తున్నప్పుడు బెల్లం పానకంలో కరక్కాయ ని లేక కరక్కాయ పొడిని వేసి ఉడికించి తీసుకోవాలి. ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసికట్టుగా హింసిస్తున్నప్పుడు వేడిచేసిన పాత నెయ్యిలో కరక్కాయల పెచ్చుల చూర్ణం, ఇంగువ పొడి, బిడాలవణం చేర్చి కలిపి మోతాదుకు అర టీస్పూన్ చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. రక్తహీనతతో బాధపడేవారు కరక్కాయ‌లను గోమూత్రంలో నానబెట్టి, తరువాత ఎండబెట్టి, పొడిచేసి, పూటకు అర టీస్పూన్ మోతాదులో రెండు పూటలా అర కప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి. కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, బెల్లం వీటి సమాన భాగాలను కలిపి నిల్వచేసుకొని మోతాదుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. మలంతోపాటు జిగురు పడటం ఆగుతుంది. ముఖ్యంగా శరీరంలో నీరు పట్టడం తగ్గుతుంది.

కఫదోషంవల్ల శరీరంలో వాపుతయారైనప్పుడు కరక్కాయలను గోమూత్రంలో నానబెట్టి, పొడిచేసి పూటకు 3గ్రాముల మోతాదుగా అర కప్పు వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి. కరక్కాయల చూర్ణం, ఇప్ప పువ్వు, పిప్పళ్లు చూర్ణం మూడూ కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా తేనె చేర్చి వేడినీళ్లతో సహా రెండుపూటలా తీసుకుంటే శరీరంలో తయారైన వాపు తగ్గుతుంది. కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, దేవదారు చూర్ణం మూడు సమభాగాలు కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా, వేడినీళ్లతో రెండుపూటలా తీసుకుంటే శరీరంలో చేరిన నీరు వెళ్లిపోయి వాపు తగ్గుతుంది. కరక్కాయ పిందెల చూర్ణాన్ని 3గ్రాముల మోతాదుగా బెల్లంతో కలిపి అర కప్పు నీళ్లతో తీసుకుంటే శరీరంలో చేరిన వాపు తగ్గుతుంది.

Tags: Karakkaya
Previous Post

కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్రలేవాలి?

Next Post

ఈ 5 వస్తువులు గిఫ్ట్స్ గా అస్సలు ఇవ్వకూడదు అంట.! అవేంటో తెలుసా.? ఎందుకంటే.?

Related Posts

ఆధ్యాత్మికం

మీకు క‌ల‌లో వినాయ‌కుడు క‌నిపించాడా.. అయితే దాని అర్థం ఏమిటంటే..?

July 11, 2025
vastu

ఇంట్లో చెప్పులు వేసుకుని తిర‌గ‌డం మంచిదేనా..?

July 11, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడికి అస‌లు ఏ పండ్ల‌ను నైవేద్యంగా పెట్టాలో తెలుసా..?

July 11, 2025
వైద్య విజ్ఞానం

మీ ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందా.. అయితే ఈ వ్యాధి కావచ్చు..!!

July 11, 2025
lifestyle

ఈ 5 వాసనలు ఉంటే దోమలు అస్సలు కుట్టవు.. ఎందుకంటే..?

July 11, 2025
చిట్కాలు

అధిక బరువా.. పర‌గడుపున ఇది తాగండి ఇట్టే తగ్గుతారు..!!

July 11, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.