ఆకలి పూర్తిగా తగ్గిపోయిందా ? ఈ చిట్కాలను పాటిస్తే ఆకలి పెరుగుతుంది..!

జీర్ణ సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. వాటిల్లో ఆకలి లేకపోవడం ఒకటి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ముఖ్యమైన కారణం.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం. దీని వల్లే మనకు ఆకలి తగ్గుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. అవేమిటంటే..

if you do not have hunger then follow these remedies

అల్లం మన జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఇది ఆకలిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఒక చెంచా అల్లం రసంలో నల్ల ఉప్పు కొద్దిగా,  2 నుండి 3 చుక్కల నిమ్మరసం కలిపి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా కొన్ని రోజులు తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆకలి బాగా పెరుగుతుంది.

కూరగాయలు, చట్నీ మొదలైన వాటిలో ఉపయోగించే ఆకుపచ్చని కొత్తిమీర కూడా ఆకలిని పెంచడంలో సహాయపడుతుంది. దీని కోసం.. అర కప్పు కొత్తిమీర ఆకులను తీసుకొని వాటిని బాగా కడిగి నీటితో రుబ్బుకోవాలి. దీన్ని ఫిల్టర్ చేసి వారానికి మూడుసార్లు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. దీంతో ఆకలి లేమి సమస్య తగ్గుతుంది. ఆకలి బాగా అవుతుంది.

వాము జీర్ణ సమస్యలకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. రెండు మూడు టీస్పూన్ల వాము గింజలను కొద్దిగా నిమ్మరసంలో వేసి ఎండ బెట్టాలి. అది బాగా ఎండిన తర్వాత దానికి నల్ల ఉప్పు కలపాలి. భోజనానికి అరగంట ముందు కొన్ని వాము గింజలను నమలండి. గోరువెచ్చని నీరుతాగండి. ఇది ఆకలిని పెంచడానికి ఎంతగానో సహాయ పడుతుంది.

ఒక కప్పు సోంపు గింజలు, టీస్పూన్ మెంతులను రెండు కప్పుల నీటిలో కొంతసేపు నానబెట్టండి. తర్వాత వాటిని  మరిగించాలి. దీని తర్వాత ఫిల్టర్ చేసి టీ లాగా తాగండి. మీకు కావాలంటే కొద్దిగా తేనె జోడించవచ్చు. రోజూ ఈ పానీయం తాగడం వలన కొన్ని రోజుల్లో ఆకలి పెరుగుతుంది.

నల్ల మిరియాలు ఆకలి సమస్యను  తగ్గిస్తాయి. దీని కోసం ఒక చిన్న చెంచా బెల్లంలో అర టీస్పూన్ పిండిచేసిన నల్ల మిరియాలను కలిపి కొన్ని రోజులు ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.  దీంతో ఆకలి పెరుగుతుంది.

Share
Editor

Recent Posts